Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం

Updated : Apr 30, 2026

 

నీకు ఎవరున్నా లేకపోయినా నేను ఉన్నాను, జోష్ గ్యారంటీ అంటూ ఏ రోజు కా రోజు సరికొత్త సినీ క్రేజీ న్యూస్ టాలీవుడ్ ట్రెండింగ్ రంపంలో మన ముందుకు వస్తూనే ఉన్నాయి. మరి ఈ రోజు  టాలీవుడ్ ట్రెండింగ్ చూద్దాం.

1 .పవన్ పై ఘాటైన విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ 

పవన్ కళ్యాణ్ గురించి రీసెంట్ గా ప్రకాష్ రాజ్ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు సెలెక్టివ్ గా ఉంటున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కేవలం మతపరమైన భావోద్వేగాలకి సంబంధించిన అంశాలపైనే స్పందిస్తూ, ఇతర దేశవ్యాప్త సమస్యలని పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. సదరు  ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్, జనసేన నాయకులూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ నే తన  పంథా మార్చుకొని సెలెక్టివ్ పాలిటిక్స్ కి  స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు.

2 .పూజాహెగ్డే ఆ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతుందా!

బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రముఖ బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో వివాహం చేసుకోబోతుందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజానికి ఈ ఇద్దరు  రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా ఆ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, ఒకరి గురించి ఒకరు చేసుకొనే సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒకే కారులో ఆ ఇద్దరు కనపడటంతో పెళ్లి టాపిక్స్ వస్తున్నాయి

3 .బాలకృష్ణ, శేఖర్ కమ్ముల కాంబో ఫిక్స్ అవ్వబోతుందా!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, ఈ కాంబో సెట్ అయితే టాలీవుడ్‌లో ఒక మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు. శేఖర్ కమ్ముల అనగానే మనకి గుర్తొచ్చే సినిమాలు తెలిసిందే. మరి   బాలయ్య అనగానే గుర్తొచ్చే ఊర మాస్ సినిమాలు తెలిసిందే.

4 . థియేటర్స్ లో అడుగుపెట్టిన కర
ధనుష్ ఈ రోజు 'కర' తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. మూవీ చూసిన ప్రేక్షకుల నుంచైతే  టాక్ కొంచం తేడాగానే వస్తుంది. అసలు బుకింగ్స్ రెస్పాన్స్ కూడా పెద్దగా లేకపోవడం గమనార్హం. ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ 

5 .ఎట్టకేలకు థియేటర్స్ లో అడుగుపెడుతున్న ధ్రువ నక్షత్రం 

చియాన్ విక్రమ్, విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబోలో తెరకెక్కిన మూవీ ధ్రువ నక్షత్రం. దగ్గర దగ్గరగా ఏడేళ్ల నుంచి రిలీజ్ కష్టాలని మోస్తూ వస్తుంది. ఎట్టకేలకు ఆ కష్టాలకి సెండ్ ఆఫ్ ఇచ్చి మే 22 న రిలీజ్ కాబోతున్నటుగా టాక్. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుంది.

6 . కందుల సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్ 

శర్వానంద్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భోగి. ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో తెరకెకక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అనుపమ లుక్ రిలీజ్ చేసారు. కందుల సులోచన రాణిగా అనుపమ కనిపించబోతుంది. నెత్తి పైన కూరగాయల గంప పెట్టుకొని చేతిలో టిఫిన్ క్యారేజ్ పట్టుకుని ఉన్న అనుపమ లుక్ సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ హోదాలో కొనసాగుతుంది.

7 .పెద్ది మూడో లుక్ రాబోతోందా!

పెద్దికి సంబంధించి ఇప్పటికి వరకు రెండు లుక్స్ వచ్చాయి. సదరు లుక్స్ తో చరణ్ క్రికెటర్ గా,  కుస్తీ ఫైటర్ గా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడని అర్ధమయ్యింది . ఇప్పుడు మూడో లుక్  త్వరలోనే రాబోతుందనే మాటలు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. పెద్దిలో చరణ్ పలు క్రీడలో ప్రావిణ్యం ఉన్న వ్యక్తిగా చేస్తున్న నేపథ్యంలో   ఈ సారి ఎలాంటి గేమ్ కి సంబంధించిన పిక్ బయటకి వస్తుందా అనే ఆసక్తి మొదలైంది.

8 .డ్రాగన్ లో ఊహించని లుక్ లో ఎన్టీఆర్!

 ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే.  ఎవరు ఊహించని మేకోవర్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడనే టాక్ వినపడుతుంది. ప్రెజెంట్ ఉన్న సన్నటి లుక్ నుంచి నెక్స్ట్ బరువు పెరిగి బల్క్ బాడీ తో ఫిట్ గా కనిపించనున్నట్టుగా టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్ జూన్ 11  డ్రాగన్ రిలీజ్ డేట్

9 . లెజెండరీ డైరెక్టర్ సినిమాకి  వెరైటీ టైటిల్‌!

సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం లో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఒక చిత్రం రూపు దిద్దు కుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి 'Sing - Geetham' అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సంగీత నేపథ్యంలో సాగే స్టోరీ . దాదాపు డజను పాటలు ఉంటాయట. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

10 .కల్కి 2 లో నేను లేనంటున్న జెడి చక్రవర్తి 

ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలియదు గాని కల్కి 2 లో జె డి చక్రవర్తి చేస్తున్నాడనే  న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ వార్తలపై జె డి స్పందిస్తు నేను కల్కి 2 లో చేయలేదని చెప్పాడు. జేడి రేపు 'గాయపడ్డ సింహం' తో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.