![]() |
![]() |

ఈ వారం సినిమాల సందడి మామూలుగా లేదు. ఏకంగా పది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. నేడు(ఆగష్టు 1న) అశ్విన్ బాబు 'శివం భజే' (Shivam Bhaje) విడుదలైంది. ఆగష్టు 2న అల్లు శిరీష్ 'బడ్డీ' (Buddy), రాజ్ తరుణ్ 'తిరగబడరసామీ' (Tiragabadara Saami), వరుణ్ సందేశ్ 'విరాజి'తో పాటు 'ఉషాపరిణయం', 'అలనాటి రామచంద్రుడు', 'తుఫాన్', 'యావరేజ్ స్టూడెంట్ నాని', 'లారి చాప్టర్-1' వంటి సినిమాలు విడుదలవుతున్నాయి. అజయ్ దేవ్‌గణ్ నటించిన 'ఔరోన్ మే కహన్ దమ్ థా' అనే హిందీ చిత్రం సైతం రేపే విడుదలవుతోంది.
ప్రస్తుతం థియేటర్లలో స్టార్ల సినిమాలు పెద్దగా లేవు. ప్రభాస్ 'కల్కి' (Kalki) రన్ దాదాపు ఎండ్ కి వచ్చింది. ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో.. దేనికైనా పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు రాబట్టడానికి అవకాశముంది. మరి వీటిలో మెప్పించే సినిమా ఏదో, నిరాశపరిచే సినిమా ఏదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
![]() |
![]() |