![]() |
![]() |

`కండుకొండేన్ కండుకొండేన్` (తెలుగులో `ప్రియురాలు పిలిచింది`) చిత్రం తరువాత కోలీవుడ్ స్టార్ అజిత్, ఎవర్ గ్రీన్ బ్యూటీ టబు.. మరోసారి జట్టుకట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. `ఖాకి` ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్నారు. `నేర్కొండ పార్వై`, `వలిమై` చిత్రాల అనంతరం అజిత్ - వినోద్ - బోనీ కపూర్ త్రయం చేయబోతున్న మూడో సినిమా ఇది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.
Also Read: ఓటీటీలో రిలీజైతే కలెక్షన్లు రావనే అభిప్రాయాన్ని తుత్తునియలు చేసిన 'పుష్ప'
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో ఆయన ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమిస్తారట. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అజిత్, టబు తొలిసారిగా కలిసి నటించిన `ప్రియురాలు పిలిచింది`లో మరో మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. మరి.. మమ్ముట్టిలాగే మోహన్ లాల్ ప్రెజెన్స్ కూడా అజిత్, టబు సెకండ్ జాయింట్ వెంచర్ కి ప్లస్ అవుతుందేమో చూడాలి.
Also Read: మాల్దీవుల్లో బికినీతో కేకపుట్టిస్తున్న కత్రినా! విక్కీ ఎక్కడ?
కాగా, గతంలో కమల్ హాసన్, విజయ్, సూర్య వంటి స్టార్స్ నటించిన తమిళ సినిమాల్లో మోహన్ లాల్ సందడి చేశారు. 2009 నాటి `ఉన్నైపోల్ ఒరువన్`లో కమల్ తో కలిసి నటించిన లాల్.. 2014 నాటి `జిల్లా`లో విజయ్ తోనూ, 2019 నాటి `కాప్పాన్` సినిమాలో సూర్యతోనూ జట్టుకట్టారు.
![]() |
![]() |