![]() |
![]() |

ప్రస్తుతం థియేటర్స్ ఎలా అయితే కొత్త చిత్రాల విడుదలతో కళకళలాడుతున్నాయో, ఓటిటి వేదికగా కూడా పలు జోనర్స్ కి చెందిన విభిన్న చిత్రాలు మూవీ లవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒక చిత్రమే 'ది మాస్క్'(The Mask).టైటిల్ లోనే ఎంతో విభిన్నతని చాటుకున్న ది మాస్క్ ఈ నెల 12 నుంచి ప్రముఖ ఓటిటి మాధ్యమం 'ఈటీవీ విన్'(Etv Win)లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే ఈజీ మనీ కోసం ఒక యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పందెం కాసి, ఆ డబ్బులు మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. అప్పు చేసిన డబ్బు కావడంతో, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఒక ధనవంతుల ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు.ఈ క్రమంలో ఒక ఆపదలో చిక్కుకుంటాడు.మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే చిత్ర కథ. చెప్పుకోవడానికి చిన్న పాయింట్ అయినా సస్పెన్స్, డ్రామా, డార్క్ హ్యూమర్ ఒక రేంజ్ లోఉంటుంది. కథనంలో పట్టు సడలకుండా ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో కూడా మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
రిషికేశ్వర్ యోగి సమర్పణలో, కథా గని పిక్చర్స్ బ్యానర్‌పై కొత్తపల్లి సురేష్(Kothapalli Suresh)దర్శకత్వం వహించగా రావన్ నిట్టూరి, గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించారు. విశాల్ భరద్వాజ్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

![]() |
![]() |