![]() |
![]() |

సీనియర్ హీరోయిన్ శోభన గుర్తున్నారు కదా! తెలుగులో చాలా చిత్రాలు చేశారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తెలుగులో సినిమాలు ఏవి చేయలేదు గాని... మలయాళంలో చేశారు. ఇటీవల మమ్ముట్టి కుమారుడు... 'ఓకే బంగారం', 'మహానటి', 'కనులు కనులను దోచాయంటే' ఫేమ్ దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళ సినిమాలో సురేష్ గోపి సరసన 'వారనే అవశ్యముండ్' చిత్రంలో నటించారు. అయితే... ఆమె అభిమానులు మోహన్ లాల్, మమ్ముట్టి సరసన ఆవిడ నటించాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో అదే విషయాన్ని అడిగారు.
'భవిష్యత్తులో మోహన్ లాల్, మమ్ముట్టి సరసన నటిస్తారా?' అనే శోభనను ప్రశ్నించగా... "యస్. వారిద్దరితో తప్పకుండా నటిస్తా. నిజంగా వాళ్లు ఇద్దరికీ ఫోన్ చేసి... 'నా ఫాలోయర్లు మీతో నేను నటించాలని కోరుకుంటున్నారు' అని చెబుతా" అని సమాధానం ఇచ్చారు.
![]() |
![]() |