![]() |
![]() |
.jpg)
సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన 'వన్ నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతి సనన్ గుర్తుంది కదా! నాగచైతన్యతో 'దోచేయ్' కూడా చేసింది. ఇప్పుడామె హిందీలో కాస్త బిజీ హీరోయినే. మిగతా సినిమాల వల్ల గతేడాది ఓ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోయింది. కృతి సనన్ ప్రధాన పాత్రలో నేషనల్ అవార్డు ఫిలిం 'పర్జానియా' తీసిన రాహుల్ డోలాకియా ఒక ఫిమేల్ సెంట్రిక్ ఫిలిం తెరకెక్కించాలని అనుకున్నారు. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ, ఆమె డేట్స్ కుదరక ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు అదే కథ తాప్సీ చెంతకు చేరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాప్సీ కంటే ముందు ఈ కథ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా దగ్గరకు వెళ్లిందట. ఆమె కూడా ప్రస్తుతం తన డైరీ ఖాళీగా లేదని చెప్పడంతో దర్శకుడు రాహుల్ డోలాకియా వెనక్కి వచ్చారు. ఇటీవల తాప్సీని కలిసి కథ చెప్పగా, ఆమె వెంటనే అంగీకరించారని సమాచారం. నటనకు ఆస్కారం ఉన్న క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఎస్ అన్నారట. ఆమె నటించిన హిట్ సినిమా 'బద్లా' నిర్మాతలలో ఒకరైన సునీర్ ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా తాప్సి చేయాలని రాసిపెట్టి ఉందన్నమాట. హిందీలో ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్‌కి తాప్సీ కేరాఫ్ అడ్రస్ అవుతున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
![]() |
![]() |