![]() |
![]() |

రామ్‌చరణ్‌కి 'మగధీర' రెండో సినిమా. అందులో అతడికి లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ మాత్రమే కాదు... ఇండస్ట్రీ రికార్డ్ హిట్ రాజమౌళి ఇచ్చాడు. 'మగధీర' వచ్చి పదేళ్లు దాటింది. మళ్లీ ఇన్నాళ్లకు రామ్ చరణ్, రాజమౌళి కలిసి పని చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. చరణ్ పుట్టినరోజుకి టీజర్ రిలీజ్ చేశారు. అందులో మగధీరుడి హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేశారు. రామ్ చరణ్ నటనలో మెచ్యూరిటీ, నటుడిగా అతడిలో మార్పు సుస్పష్టంగా కనిపించింది.
రామ్‌చరణ్‌లో మార్పు గురించి బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. "నేను, చరణ్ పదేళ్ల క్రితం 'మగధీర' చేశాం. హీరోగా చరణ్‌కి అది రెండో సినిమా. ఫుల్ ఎనర్జీతో ఉండేవాడు. ఏది చేయమన్నా వెంటనే చేసేవాడు. అయినప్పటికీ... అతడిలో 'రానెస్' ఉండేది. 'మగధీర'కి ఆ రానెస్ వర్కవుట్ అయింది. ఈ పదేళ్లలో నటుడిగా అతడు చాలా పరిణితి సాధించాడు. అతడిలో మెచ్యూరిటీ కనిపిస్తోంది. చూపుల్లో, మాటల్లో, భావోద్వేగాల్లో, నటనలో సెటిల్డ్ గా చేస్తున్నాడు. 'రంగస్థలం'లో నటుడిగా ఎంతో పరిణితి చూపించాడు. ఇప్పుడు అతను నిజంగా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నాడు" అని రాజమౌళి అన్నారు.
![]() |
![]() |