![]() |
![]() |

సింహం సమయం చూసుకుని వేటాడుతుంది. అది అడవికి రారాజు కాబట్టి! మిగతావి అలా కాదు. తమకు వేటాడే సమయం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తాయి. స్టార్ హీరోల సినిమాలు సింహాలు వంటివే. పండగలు, సెలవలు, మంచి సీజన్ చూసుకుని భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మాతలు విడుదల చేస్తుంటారు. చిన్న సినిమా నిర్మాతలు అలా కాదు. తమకు ఎప్పుడు థియేటర్లో దొరుకుతాయా అని ఎదురు చూస్తారు. ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్. అందుకని, భారీ చిత్రాలు ఏవి థియేటర్లలోకి రావడం లేదు. ఇదే అదునుగా చిన్న చిత్రాలు థియేటర్లలోకి దూకుతున్నాయి.
ఈ శుక్రవారం థియేటర్లలో చిన్న చిత్రాల జాతర జరగడానికి అంతా సిద్ధమైంది. మీకు తెలుసా? ఈ శుక్రవారం అటు ఇటుగా ఆరేడు చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో కొద్దో గొప్పో 'మధ' చిత్రం ప్రేక్షకులకు తెలుస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్, నటుడు నవదీప్, నిర్మాత మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడంతో కాస్త క్రేజ్ నెలకొంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డ్స్ రావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
ప్రతి శుక్రవారం థియేటర్లలోకి ఏదో ఒక అడల్ట్ కంటెంట్ సినిమా వస్తూనే ఉంది. ఈ శుక్రవారం కూడా అటువంటి సినిమా ఒకటి వస్తుంది. అదే 'ప్రేమ పిపాసి'. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైలర్ హాట్ కంటెంట్ కి ఏ మాత్రం ఢోకా లేదన్న సంగతి చెప్పింది. ఈ సినిమాలో మొత్తం 12 లిప్ లాక్స్ ఉన్నాయట. బోల్డ్ గా తీస్తేనే క్లిక్ అయ్యే కంటెంట్ అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఒక సెక్షన్ ఆడియన్స్ లో ఈ సినిమాపై క్రేజ్ నెలకొంది. దీంతోపాటు 'యురేక' అనే సినిమా ఒకటి వస్తుంది. కాలేజ్ ఫెస్టివల్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. సినిమాల మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రెండు సినిమాలు కూడా కొంచెం తెలుస్తున్నాయి.
పైన చెప్పుకున్న మూడు చిత్రాలతో పాటు విజయ్ సేతుపతి నటించిన ఓ తమిళ సినిమాను 'పిజ్జా 2' టైటిల్ తో డబ్బింగ్ చేసి ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. అలాగే... 'శివన్', 'బగ్గిడి' గోపాల్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవే కాకుండా చిన్న చిన్నగా సినిమాలో ఇంకో రెండు మూడు ఉంటాయని ఇండస్ట్రీ టాక్.
![]() |
![]() |