Home  »  News  »  అసహ్యించుకుంటారంటూ... కొరటాలపై మహేశ్ అసహనం!

Updated : Jan 19, 2018

మహేశ్ బాబుకు కోపం వచ్చిందట! దర్శకుడు కొరటాల శివపై అంతెత్తు లేచాడట!. ‘ఏంటిది.. అర్థం లేకుండ? చండాలంగా ఉంటుంది. జనాలు అసహ్యించుకుంటారు.’ అని సీరియస్ గా చెప్పేశాడట!. ఏంటి? ఎందుకొచ్చింది సూపర్ స్టార్ కి అంత కోపం అనుకుంటున్నారా? 

ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ‘భరత్ అను నేను’ అని టైటిల్ కూడా ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెకండాఫ్ లో ఓ ఐటమ్ సాంగ్ కి ప్లాన్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. సరిగ్గా అక్కడే మహేశ్ కి కోపం తన్నుకొచ్చింది. దానికి కారణం లేకపోలేదు. ‘భరత్ అను నేను’ సందేశాత్మక చిత్రం. సినిమా ద్వారా వినోదంతో పాటు కాస్తంత సందేశం కూడా ఇవ్వాలని భావించారు మహేశ్, కొరటాల శివ. సినిమా కూడా చాలా బాగా వస్తోందని టాక్. ఫస్టాప్ సినిమా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ లోని కీలక సన్నివేశాలు ఎక్కువుంటాయ్. కాస్త సీరియస్ మోడ్ లో కథ సాగుతుంది. ఇలాంటి టైమ్ లో మధ్యలో ఓ ఐటమ్ సాంగ్ ఉంటే బావుంటుందని దర్శకుడి భావన.

అయితే... మహేశ్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా స్పందించాడు. అందరూ కథలో ఉంటారు. మనం చెబుతున్న సమస్యలో మునిగి ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి పాట పెడితే.. చండాలంగా ఉంటుంది. జనాలు అసహ్యించుకుంటారు. ఉండటానికి వీల్లేదు. అని కరాఖండీగా చెప్పేశాడట. 

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! పేరు దర్శకుడు కెప్టెనే అయినా... హీరోదేగా ఇండస్ట్రీలో హవా. అదండీ విషయం. కైరా అడ్వాణీ మహేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.