![]() |
![]() |

గురువుకు ఉన్న పిచ్చి .. శిష్యులకు కూడా అంటుకోకుండా ఉంటుందా? చెప్పండి. యధా రాజా.. తథా ప్రజా అని ఊరకే అన్నారా? మన జేడీ చక్రవర్తి రీసెంట్ గా మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా ఇలాగే అంటారు మరి. 1989 నుంచి ఇప్పటివరకూ వచ్చిన నందీ అవార్డులననీ ‘స్టుపిడ్’ అవార్డులట. కారణం? అనడిగితే.. మనోడు ఏడో గొప్ప ఆన్సర్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కారణం... తనకు రాకపోవడమే కారణమట. దీన్ని పిచ్చి గాక ఏమంటారు చెప్పండి. అన్నట్టు మరచిపోయాను... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కూడా మనోడు టార్గెట్ చేశాడండోయ్.
పవన్ సినిమా వల్ల యువత ప్రభావితం అవుతున్న మాట అవాస్తవమట. కేవలం తన సేవాకార్యక్రమాల వల్లే పవన్ పాపులర్ అయ్యాడట. అంతేతప్ప.. సినిమాల ప్రభావం ఏ మాత్రం లేదట. మనోడు తేల్చిచెప్పేశాడు. ఇప్పటివరకూ... ఫేస్ బుక్, ట్వీటర్ అకౌంట్లు తనకు లేవనీ... ఆ పిచ్చి కూడా తనకు లేదని జేడీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కన్నడ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడట. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడట. జేడీ చెబుతున్నాడు. ఈ మాటల్ని చూస్తుంటే... వర్మ గుర్తు రావడంలా. ఎంతైనా.. ఆ గురువు శిష్యుడేగా!
![]() |
![]() |