![]() |
![]() |

బాహుబలితో భారతీయ సినిమా గర్వపడేలా చేసి దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళికి 2017వ సంవత్సరానికి గానూ ఏఎన్నార్ జాతీయ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ శిల్పకళా వేదికలో అవార్డు పురస్కార కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యఅతిథులుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అనంతరం వెంకయ్య చేతుల మీదుగా ఏఎన్నార్ అవార్డ్‌ను రాజమౌళికి బహుకరించారు.
![]() |
![]() |