![]() |
![]() |

నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో సీనియర్ ఆక్టర్ చలపతి రావు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. నాగార్జున ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేయగా, రకుల్ తన వంతుగా చలపయ్య ని ఏకి పారేసింది. కొందరు చలపతి చేసిన వ్యాఖ్యలకు చైతు, రకుల్ నవ్వుతూ కనిపించారు అని చేసిన విమర్శలకి స్పందిస్తూ, టీవీ లో టెలికాస్ట్ 5 నిముషాలు ఆలస్యంగా వస్తుంది అని... తాము నవ్వింది చలపతి గారి మాటలకి కాదని రకుల్ వివరణ ఇచ్చింది. తనకి అర్ధం కాకపోవడం వల్లే ఆలస్యంగా ఈ విషయం గురించి రియాక్ట్ అవుతున్నానని, లేదంటే ఆ రోజే స్టేజి మీదే తన అభిప్రాయం వ్యక్తపరిచేదాన్నని చెప్పుకొచ్చింది. చలపతి గారు తన వయసుకు తగ్గట్టు మలచుకోవాల్సిందని... ఇలాంటి సంఘటనలు ఆయనకు ఆప్తుల దగ్గర చెడు అభిప్రాయం తీసుకువస్తాయని... కొత్త వాళ్ళకి కూడా ఇండస్ట్రీ అంటే తప్పుడు భావం ఏర్పడుతుందని... తాను విడుదల చేసిన స్టేట్మెంట్ లో చెప్పింది. తనకు పెద్ద వాళ్లంటే గౌరవమని, కానీ పెద్ద వాళ్లే తప్పు చేస్తుంటే మాట్లాడకుండా ఉండలేకపోయానని వివరించింది. నాగ చైతన్య, రామ్ మరికొందరు తెలుగు ఆక్టర్స్ చలపతి రావు చేసిన వ్యాఖ్యలను గట్టిగానే ఖండించారు. ఇంత జరుగుతున్నా అందరు యంగ్ హీరోలతో బాబాయ్ అని పిలిపించుకునే చలపయ్య తాను చేసిన తప్పుకి ఇంకా వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
![]() |
![]() |