![]() |
![]() |

తెలుగు చిత్ర సీమలో మెగా, నందమూరి కుటుంబాలు ఎంత సన్నిహితంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అయితే సినిమాలకు వచ్చే సరికి రికార్డులు, కలెక్షన్లు అంటూ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150కి, బాలయ్య శాతకర్ణి కలెక్షన్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే నడిచింది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది.
పవర్‌స్టార్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్లు మాత్రం కుమ్మెస్తున్నాడు రాయుడు. ఎప్పటిలాగే కాటమరాయుడికి, జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలకు ముడిపెట్టేశారు నందమూరి, మెగా అభిమానులు. అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు రాబట్టిన రాయుడు సీడెడ్‌లో మాత్రం ఎన్టీఆర్‌ను కొట్టలేకపోయాడట. జనతాగ్యారేజ్ రూ.9.66 కోట్లను కొల్లగొట్టగా..కాటమరాయుడు కేవలం రూ.7.11 కోట్లు వసూలు చేసిందని అభిమానులు అంటున్నారు. రాయుడికి థియేటర్లు తగ్గిపోతుండటంతో సీడెడ్‌లో ఎన్టీఆర్ రికార్డును పవన్ క్రాస్ చేయడం కష్టమే అంటున్నారు అభిమానులు.
![]() |
![]() |