![]() |
![]() |
.jpg)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో ధనుష్‌కి టైం అస్సలు బాగున్నట్లు లేదు. వరుస వివాదాలతో ధనుష్ ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. హీరో ధనుష్ తమ కుమారుడే అంటూ కథిరీశన్, మీనాక్షీ అనే దంపతులు కోర్టుకెక్కారు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధనుష్ మీద ఈ దంపతులు మరో కేసు పెట్టారు. ధనుష్ దాఖలు చేసిన పిటిషన్‌లో అతని సంతకం నకిలీదని పేర్కొన్నారు.. అంతేకాకుండా అతని సంతకం నకలును తమకు అందజేయాలని కోరారు. ఇప్పటికే ఇదే కేసులో పుట్టుమచ్చలను చెరిపేసుకున్నాడని ఆరోపిస్తూ కదిరీశన్ దంపతులు నివేదికలో పేర్కొనడంతో ధనుష్ ఇబ్బందుల్లో పడ్డాడు. తాజాగా సంతకం కూడా నకిలీదేనంటూ వారు వాదిస్తుండటంతో ఏమవుతుందోనని కోలీవుడ్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
![]() |
![]() |