![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ శిల్పకళావేదికలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ స్నేహితుడు, కమెడియన్ అలీ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. పవన్‌తో నాకు 20 ఏళ్ల అనుబంధముందన్నాడు. ఆయనొక గ్రేట్ ఫ్రెండ్ అని పవన్‌ను ఒకసారి కలిస్తే చాలు వారి పేరును గుర్తుంచుకుని కుశలప్రశ్నలు అడుగుతారని, ఆయన మెమరీలో వేలాది పేర్లు ఉంటాయన్నారు. పవన్‌లో సుగుణం ఏంటంటే డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇస్తాడు తప్ప దాని మీద ఆశ కానీ ప్రీతి కానీ లేదని చెప్పాడు. ఆయనకు డబ్బు మీద ఆశ ఉంటే పవన్ కళ్యాణ్‌ను ఈ రోజు ఇంకోలా చూసి ఉండేవారమని అన్నాడు.
![]() |
![]() |