![]() |
![]() |

కమల్‌హాసన్ చుట్టూ వివాదాలు వైఫైలా తిరుగుతుంటాయి. సినిమాల్లోనూ, బయట.. ఆయనకు కాలక్షేపం ఈ వివాదాలే! తాజాగా కమల్‌హాసన్ `మహాభారతం`పై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ద్రౌపతి పాత్రపై సెటైర్లు వేశాడు. ఓ ఆడదాన్ని అడ్డం పెట్టుకొని.. జూదం ఆడారని, ఆడదాన్ని ఆట వస్తువుగా మార్చేశారని, మహిళకు ఇంతకంటే అవమానం ఇంకోటి ఉండదని, అలాంటి మహాభారతాన్ని భారతదేశం ఇంకా పవిత్ర గంధ్రంగా ఎందుకు భావిస్తోందో, ఎందుకు గౌరవిస్తోందో అర్థం కావడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో... హిందూ సంఘాలు కమల్‌హాసన్‌పై విరుచుకుపడుతున్నాయి.
కమల్‌కు ఈ దేశంమీద, ఇక్కడి సంప్రదాయాలపైనా గౌరవం లేదని, మహా భారతాన్ని అపహాస్యం చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని అప్పుడే డిమాండ్లు మొదలైపోయాయి. కొంతమంది హిందు సంఘాల నేతలు.. కమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమల్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ హెచ్చరించింది. కమల్‌కు ఇలాంటి వివాదాలు మామూలే. మనసులో ఉన్న భావాల్ని మొహమాటం లేకుండా చెప్పడం, ఏది అనుకొంటే అది చేయడం కమల్‌కి అలవాటే. కానీ పోయి పోయి... మత గ్రంధాలతో, సంప్రదాయాలతో పెట్టుకోవడం మాత్రం.. కమల్ని ఇబ్బందుల్లో నెట్టే విషయమే. ఈ గొడవ నుంచి.. కమల్ హాసన్ ఎలా బయటపడతాడో చూడాలి.
![]() |
![]() |