![]() |
![]() |
.jpg)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడుకు ఆడియో ఉండదని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలోని ఆరు పాటలను రోజుకొక్క పాట చొప్పున రిలీజ్ చేస్తామని తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మూడు సాంగ్‌లను విడుదల చేశారు. వాటికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చేంది. తాజాగా ఏమో..ఏమో అంటూ సాగే నాలుగో సాంగ్‌ని రిలీజ్ చేసింది యూనిట్. శ్రేయా ఘోషల్, అర్మాన్ మాలిక్ ఆలపించగా..అనూప్ రూబెన్స్ మెలోడీ టచ్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తుండగా..డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన శృతిహసన్ నటిస్తున్నారు. ఈ నెల 24న కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
![]() |
![]() |