![]() |
![]() |
.jpg)
అమ్మ జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయాల్లో ఒక్కసారిగా పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ పగ్గాలు శశికళ నటరాజన్ చేతిలోకి వెళ్లగా...ముఖ్యమంత్రి పదవిలో ప్రస్తుతం పన్నీర్‌సెల్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా డమ్మీగానే మారిపోయారు. ముఖ్యమంత్రి పదవి కూడా శశికళ చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఈ మార్పులన్నీ డీఎంకే పార్టీ గమనిస్తూ ఉంది.
అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో ఓ వ్యక్తి పేరు మాత్రం బాగా వినిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడమే మంచిదని..రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. ఆయన అభిమానులు దగ్గర నుండి పలువురు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుండో కోరుతున్నారు. కానీ తనకు రాజకీయాలంటే ఇష్టంలేదని రజనీ గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారో లేదో.. చూడాలి. ఇవన్నీ ఒకత్తైతే.. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటామంటూ సినీ నటుడు శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది.. రజనీకాంత్ అభిమానులు, శరత్‌కుమార్ అభిమానులూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. మరోపక్క, ఈ గందరగోళానికి తెరదించి, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని అభిమాన సంఘాలు తీర్మానాలు కూడా చేసేస్తున్నాయి. ఇలాంటి ఒత్తిళ్ళు రజనీకాంత్‌కి కొత్తేమీ కాదు. రాజకీయం విషయంలో రజనీకాంత్‌కి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో రజనీకాంత్ ఏమాత్రం తొందరపడ్డంలేదు. ఆశ్చర్యం ఏంటంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే, శరత్‌కుమార్‌కి వచ్చిన ఇబ్బంది ఏంటో.? ఇదేమరి, పొలిటికల్ 'కిక్' అంటే.!
![]() |
![]() |