![]() |
![]() |

'అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’... నాగార్జున సినీ ప్రయాణంలో వచ్చిన భక్తిరస చిత్రాలివి. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు రాఘవేంద్రరావు. అన్నమయ్య నాగార్జున కెరీర్ లో ఓ మధురమైన చిత్రంగా నిలిచిపోయింది. నాగార్జున కెరీర్ లోనే కాదు.. దర్శకుడు రాఘవేంద్రరావుకు కూడా సరికొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. టోటల్ గా చెప్పాలంటే వీరిద్దరికీ ఈ సినిమా ఓ మైలురాయి. ఇదే ప్రేరణతో వీరిద్దరి కలయికలో 'శ్రీరామదాసు’ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తర్వాత కాలంలో వచ్చిన వచ్చిన ‘శిరిడిసాయి’ మాత్రం నిరాశ పరిచింది. ఈ సినిమా ఫలితం పక్కన పెడితే రాఘవేంద్రరావు టేకింగ్ పైన చాలా విమర్శలు వచ్చాయి. ఈ చిత్రాన్ని టీవీ సీరియల్ గా తీశారని విమర్శించారు కొందరు. సాయి మహిమను దర్శకేంద్రుడు వెండితెరపై సరిగ్గా అవిష్కారించలేదని, అవుట్ డేటడ్ టేకింగ్ అని కొందరు బాహాటంగానే విమర్శించారు. ఈ సినిమాతో నాగార్జున ఓ నిర్ణయానికి వచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు. అదేంటంటే.. ఇక కొంత కాలం భక్తిరస చిత్రాల జోకిలికి వెళ్ళకూడదని.
అయితే ఎలా ఒప్పించారో గానీ మరోసారి నాగార్జున డేట్స్ తీసుకున్నారు రాఘవేంద్రరావు ''ఓం నమో వేంకటేశాయ'' సినిమా కోసం. వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటివలే సినిమా షూటింగ్ పూర్తయింది. నిన్ననే ఆడియో వేడుక జరిగింది. అయితే ఇప్పుడీ సినిమా పై ఓ ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. అసలు ఈ సినిమా చేయడం నాగార్జునకు ఇష్టం లేదట. భక్తిరస చిత్రాలు మరి ఇప్పట్లో చేయకూడని నిర్ణయించుకున్న నాగ్ ..రాఘవేంద్రరావు కధ చెప్పినప్పుడు ముందు వద్దనే అన్నారట. రాఘవేంద్రరావు మరీ మొహమాటం పెట్టడం వల్ల ఒప్పుకొక తప్పలేదని అంటున్నారు. కేవలం రాఘవేంద్రరావుతో ఉన్న అనుబంధం దృష్టిలో పెట్టుకొనే ఒప్పుకున్నారట. దీంతో పాటు ''నాకు ఇదే ఆఖరి సినిమా నువ్వే చేయాలి'' అని పట్టుపట్టారట దర్శకేంద్రుడు. ఆయన మాట కాదనలేక తప్పని పరిస్థితిలో ఈ సినిమాని టేకాఫ్ చేశారట నాగ్. ఇప్పుడు తీరా చూస్తే అనుకున్నదంతా జరిగింది. సినిమా అవుట్ పుట్ నాగ్ కు ఏమాత్రం సంతృప్తి కలిగించలేదట. అయితే దర్శకేంద్రుడిపై వున్న గౌరవంతో ఎవరినీ అనలేని పరిస్థితి.
![]() |
![]() |