Home

»

Latest News

తండ్రి రుణం తీర్చుకోబోతున్న కొడుకు

Dec 8, 2016 4:58PM

సుమారు ఎనిమిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఖైదీ నెం.150. చిరు రీ ఎంట్రీ, మెగాస్టార్ 150వ సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే మెగా హీరోలంతా ఈ సినిమాలో నటిస్తున్నారని లేదు లేదు చరణ్ ఒక్కడే తళుక్కున మెరవబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చెర్రీ ఈ సినిమాలో కీ రోల్‌ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్. దీనికి మరో కారణం కూడా ఉంది..గతంలో రామ్ చరణ్ నటించిన మగధీర, బ్రూస్‌లీల్లో చిరు కామియో అప్పిరెన్స్ ఆయా సినిమాలకు బాగా ప్లస్ అయ్యింది. దీంతో ఆ రుణం తీర్చుకునే ఉద్దేశ్యంతోనే ఖైదీ.నెం.150లో గెస్ట్ అప్పిరెన్స్ ఇవ్వాలని చరణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  అలాగే ఏ నటుడికైనా 150వ సినిమా అనేది ఒక మైలురాయి..అలాంటిది చిరంజీవి లాంటి గొప్పనటుడి సినిమా అయితే..దానిలో నటించే ఛాన్స్ వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న చెర్రీ 150లో గెస్ట్ రోల్‌ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com