![]() |
![]() |

ప్రధాని మోడీ పెద్దనోట్లు రద్దు ప్రకటన తర్వాత పాత నోట్లు మార్చుకోవడానికి, కొత్త నోట్లు తెచ్చుకోవడానికి జనం తిండి, తిప్పలు మాని బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాతనోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకున్న తర్వాత జనం ముఖాలు వెలిగిపోతున్నాయి. ఇంట్లో, ఆఫీసుల్లో ఫ్రెండ్స్‌కి కొత్త నోట్లు చూపించి మురిసిపోతున్నారు. కేవలం సామాన్యులే కాదు..సెలబ్రిటీల పరిస్థితి కూడా ఇంతే.
తాజాగా జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ కూడా తన దగ్గర ఉన్న కొత్తనోటును చూసి మురిసిపోతున్నారు. పెద్ద నోట్లు ప్రకటన వచ్చిన తర్వాత స్వయంగా బ్యాంకుకు వెళ్లి తన పాతనోట్లును మార్చి కొత్త నోట్లను తెచ్చుకున్నారు. కాటమరాయుడు సెట్‌లో తాను తెచ్చుకున్న రెండు వేల రూపాయల నోటుతో 100 రూపాయల నోటును పోలుస్తూ తేడాలను గమనిస్తుండగా కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఇంకేముంది పవన్ ఏంచేసినా పండుగ చేసుకునే ఫ్యాన్స్ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.
![]() |
![]() |