
బాహుబలి 'ద బిగినింగ్' రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కురిపించిన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు అందరి చూపు బాహుబలి-2 పై పడింది. దీని షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటున్నా.. వచ్చే ఏడాది విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. అయితే ఈ సినిమా బిజినెస్ మాత్రం అప్పుడే మొదలైపోయింది. మొదటి భాగానికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో రెండో భాగం ఎప్పుడు బయటకు వస్తుందా, దాన్ని ఎలా పంపిణీ చేసి మంచి లాభాలు ఆర్జిద్దామా అని అంతా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా నైజాం హక్కుల అమ్మకాలు కూడా అప్పుడే జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఈవిషయాన్ని స్వయంగా బాహుబలి టీమే తన ట్విట్టర్లో వెల్లడించింది. ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ ఈ హక్కులను కొనుగోలు చేశారని తెలిపారు. అయితే ఎంతకు అమ్మకాలు జరిగిందో మాత్రం చెప్పలేదు.
.jpg)




.jpg)

