![]() |
![]() |

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి, మెగా కుటుంబాలది ప్రత్యేక స్థానం. తన నటన, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజివీ. అయితే ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణకు, చిరంజీవికి మధ్య అగ్ర సింహసనం కోసం వైరం నడిచింది. అటు హీరోలతో పాటు ఇద్దరి ఫ్యాన్స్ కూడా నువ్వా నేనా అన్నట్టు బాహాబాహీకి దిగేవారు. కాని ఎన్ని ఉన్నా ఇరు కుటుంబాలు ఎంతో స్నేహభావంతో మెలిగేవి. చాలా సంవత్సరాలుగా మెగా..నందమూరి కాంభినేషన్‌లో సినిమా రావాలని పరిశ్రమతో పాటు ప్రేక్షకుల కోరిక. కానీ ఇది కోరికగానే మిగిలిపోయింది తప్ప ఆచరణలో సాధ్యం కాలేదు.

ఇప్పుడు వారి కలను నిజం చేసేందుకు ఇరు కుటుంబాలకు చెందిన ఇద్దరు యువనటులు రంగంలోకి దిగారు. వారే నందమూరి కళ్యాణ్‌రామ్, సాయిధరమ్ తేజ్. గతంలో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను తెరపై ఆవిష్కరించిన నిర్మాత కేఎస్ రామారావు..తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ సినిమాకు "రామకృష్ణ" అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఇందులో రామ్ క్యారెక్టర్‌లో కళ్యాణ్‌రామ్, కష్ణ పాత్రలో సాయిథరం తేజ్ కనిపించనున్నారట. ఇప్పటికే రామకృష్ణ టైటిల్‌ను..కేఎస్ రామారావు రిజిస్టర్ కూడా చేయించేశారని తెలుస్తోంది. ఇక సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం.
![]() |
![]() |