![]() |
![]() |

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్. ఈ సినిమాకీ ఎన్టీఆర్ - వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్‌సినిమాకీ చాలా పోలికలున్నాయని టాక్. అదుర్స్‌లో ఎన్టీఆర్ ఓ బ్రాహ్మణుడు. డీజేలో... బన్నీ కూడా బెపనీసే. అక్కడ.. పూజారి అయితే ఇక్కడ వంట వాడు. అదుర్స్‌లో ఓ ఎన్టీఆర్... పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తుంటాడు. పోలీసులు చేయాల్సిన పనిని.. తాను చేస్తుంటాడు. ఇక్కడ కూడా అంతేనట. దువ్వాడ జగన్నాథమ్ ఆవేశాన్ని, కోపాన్నీ ఓ పోలీస్ ఆఫీసర్ తెలివిగా ఉపయోగించుకొంటూ, తాను చేయాల్సిన పనుల్ని డీజేకి అప్పగిస్తాడట. తన సొంతూర్లో పద్దతైన బ్రాహ్మణుడిగా ఉండే దువ్వాడ జగన్నాథమ్... పట్నంలో మాత్రం డీజేగా చలామణీ అవుతాడట. పల్లెటూర్లో పంచె కట్టూ.. పట్నంలో లేటెస్ట్ కట్టూ బొట్టూ. అక్కడ వంట... ఇక్కడ ఫైటింగులు. ఇలా డీజేలో బన్నీ క్యారెక్టర్ రెండు షేడ్స్ లో సాగుతుందని సమాచారం. అన్నట్టు బ్రహ్మణుల యాస, వాళ్ల మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? అనే విషయంపై బన్నీ స్పెషల్ క్లాసులు తీసుకొంటున్నాడట. ఇద్దరు బ్రహ్మణుల దగ్గర బన్నీ ట్యూషన్ చెప్పించుకొంటున్నట్టు టాక్. కథ చూస్తుంటే అదుర్స్ సినిమానే గుర్తొస్తుంది. మరి.. డీజే కూడా అదుర్స్ లా అదుర్స్ అనిపించుకొంటుందా, లేదా? కాపీ అనిపించుకొంటుందా? అనేది తేలాలంటే... ఈ సినిమా రావాల్సిందే.
![]() |
![]() |