Home

»

Latest News

ఎన్టీఆర్ లేకుండా నా డ్రీమ్ లేదు..!

Sep 29, 2016 4:45PM

రాజమౌళి..పరాజయం అన్నది లేకుండా..తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు. అందుకే కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోలందరి ఫేవరేట్ డైరెక్టర్‌ జక్కన్నే. బాహుబలితో టాలీవుడ్ స్టామినాను పెంచినా..అన్ని రకాల జోనర్లు ట్రై చేసినా ఆయనకు ఇంకా తీరని అసంతృప్తి ఉంది. అదే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్. గురువు రాఘవేంద్రరావు ప్రభావమో లేక మరేదైనా కారణమో కానీ రాజమౌళికి పౌరాణికాలంటే అమితమైన ఆసక్తి. అందులో మహాభారతం అంటే చాలా ఇష్టం. వ్యక్తి జీవితంలోని అన్ని కోణాలను స్పృశించే భారతాన్ని తెరకెక్కించాలన్నది ఆయన డ్రీమ్. ఈ విషయాన్ని రాజమౌళియే స్వయంగా ప్రకటించారు.

దర్శకుడిగా 15 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మరోసారి బయటకు వచ్చింది. తాను మహాభారతం తీస్తే అది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్‌తోనే తీస్తానన్నారు రాజమౌళి. ఎన్టీఆర్ లేకుండా మహా భారతం ఉండదు. మహాభారత కథను తీస్తే అది ఖచ్చితంగా ఎన్టీఆర్‌తోనే అని సన్నిహితుల వద్ద అన్నారట రాజమౌళి. అయితే ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించేది ఆయన చెప్పలేదు. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి-2 తో బిజీగా ఉన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com