Home

»

Latest News

ఒక్క బోన్ విరిగితే..హాఫ్ సెంచరీనే

Sep 27, 2016 5:27PM

పీటర్ హెయిన్స్‌..ఈ పేరు వినగానే అపరిచితుడు, అతడు, మగధీర, రోబో సినిమాల్లో ఫైట్లు గుర్తొస్తాయి. హీరో విలన్లను కొట్టగానే గాల్లోకి లేచిపడ్డారంటే అది కంపోజ్ చేసింది పీటరే‌నని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న హెయిన్స్‌ది అసలు మనదేశం కాదు. వియత్నాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టంట్ మాస్టర్‌గా సక్సెస్‌తో పాటు తనకు తగిలిన దెబ్బల గురించి కూడా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 49 ఎముకలు విరిగాయని..ఒక్క ఎముక విరిగితే అర్థసెంచరీ పూర్తవుతుందన్నారు. ఒక్క మగధీర షూటింగ్ టైంలోనే 19 ఎముకలు విరిగాయి. ఈ స్టంట్ మాస్టర్ మెగాఫోన్ పట్టుకుని తన సొంతదేశంలో ఒక సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పేరు సమ్ హాయ్. తండ్రీబిడ్డల మధ్య అనుబంధాన్ని చెప్పే విధంగా మూవీ ఉండబోతోందట. అన్నట్లు ఈ సినిమాలో ఫైట్లు ఉండవట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com