Home  »  News  »  అమితాబ్‌ను వెనక్కినెట్టిన అల్లు అర్జున్..!

Updated : Sep 26, 2016

బాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్రపరిశ్రమలోనే ఆల్‌టైమ్ క్లాసిక్స్‌లో ఒకటి షోలే. రూ.3 కోట్ల వ్యయంతో..అమితాబ్, ధర్మేంద్ర, హేమామాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి లాంటి హేమాహేమీలు నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. ముంబైలోని మినర్వా థియేటర్‌లో ఏకంగా 286 వారాలు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 100కు పైగా థియేటర్లలో ఏకథాటిగా 25 వారాలు ప్రదర్శితమైంది. ఈ సినిమా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో దాదాపు రూ. 786 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా. వెండితెరైనా..బుల్లితెరైనా..ఆఖరికి యూట్యూబ్ అయినా షోలేదే అగ్రస్థానం. అందుకే అప్పటికీ ఇప్పటికీ..భారతీయ సినీ ప్రపంచంలో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది.

అలాంటి షోలేను తెలుగు సినిమా వెనక్కినెట్టింది. అసలు మ్యాటర్‌లోకి వెళితే..కొన్ని తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బయి..అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీనిలో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో, అల్లుఅర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి మూవీని హిందీలోకి అనువదించి యూట్యూబ్‌లోకి పెట్టగా..ఇప్పటి వరకు దాదాపు 7 మిలియన్ల మంది వీక్షించారు. "సత్యమూర్తి కొడుకు" యూట్యూబ్‌తో పాటు అటు టీవీల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. గత వారానికి హిందీ ఛానెళ్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సంపాదించుకున్న సినిమాల్లో సన్నాఫ్ సత్యమూర్తి అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో టాప్-3లో తెలుగు సినిమాలే ఉన్నాయి. రెండో స్థానంలో బాహుబలి నిలిస్తే..మూడో స్థానంలో ఇష్క్ హిందీ డబ్బింగ్ వెర్షన్
భాయిగిరి నిలిచింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.