![]() |
![]() |

ఇరుముడి చూసి బయటకి వచ్చిన మాస్ మహారాజా అభిమానులు ఈ సారి కొట్టేసాం, చాలా గట్టిగా కొట్టేసాం అని మాట్లాడుతు 'ఎన్నాళ్ళకెన్నాళ్ళ కెన్నాళ్ళకు వెన్నేళ్లు కురిసాయి మా కళ్ళలో' అని కూడా పాడుకుంటున్నారు. దీన్ని బట్టి రవితేజకి హిట్ ఎంత అర్జెంటు అవసరమో అర్ధం చేసుకోవచ్చు.ఇరుముడి క్రమక్రమంగా హిట్ స్థాయి నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి వెళ్తుండటం అభిమానులకి అదనపు బోనస్.
ఇరుముడిలో రవితేజ నటన అత్యంత సహజంగా, భావోద్వేగాల మేళవింపుగా సాగింది. కూతురుగా చేసిన బేబీ నక్షత్ర, రవితేజ మధ్య వచ్చిన సెంటిమెంట్ దృశ్యాలు అభిమానులు, ప్రేక్షకుల హార్ట్స్ ని టచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, రవితేజ చెప్పిన ఎమోషనల్ డైలాగులకి థియేటర్స్ విజిల్స్, ఈలలతో మార్మోగిపోతున్నాయి సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ అందించిన బాక్‌గ్రౌండ్ స్కోర్, విష్ణు శర్మ కెమెరా పనితనం, శివ నిర్వాణ రచనా, దర్శకత్వం ప్రధాన బలంగా నిలిచాయి. సెకండాఫ్ ఎమోషనల్ క్లైమాక్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తుండటంతో కుటుంబ ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు.
Also read: డోంట్ మిస్
సోషల్ మీడియాలో కూడా ‘ఇరుముడి బ్లాక్‌బస్టర్’ అనే హ్యాష్‌ట్యాగ్ X (ట్విట్టర్) వేదికగా 100,000 కంటే ఎక్కువ ట్వీట్లతో ట్రెండింగ్‌లో నిలిచింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు గ్రాస్ వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఈ విజయంపై స్పందించిన అభిమానులు "మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ ఇన్ హిస్ ఒరిజినల్ ఫోర్మ్" అంటూ పండగ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని,యలమంచిలి రవిశంకర్ మరో అదిరిపోయే హిట్ ని కైవసం చేసుకున్నారు. భీమవరం, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో అభిమానులు తెల్లవారుజామున 4 గంటలకే థియేటర్లకు చేరుకుని రవితేజ భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. సుమారు 100 అడుగుల భారీ కటౌట్లు, 50కి పైగా పూలదండలు, బాణసంచా కాల్పులతో థియేటర్ల కాంప్లెక్స్‌లని సంబరాల కేంద్రాలుగా మార్చడంతో శ్రావణమాసశోభ నూతనత్వాన్ని సంతరించుకుంది.
Irumudi, Raviteja, Nakshtra, Tollywood
![]() |
![]() |