![]() |
![]() |
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ, ప్రస్తుతం తన కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు కథానాయికగా విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆమె, ఇప్పుడు సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల భారీ ప్రాజెక్టులలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
గతంలో మహేష్ బాబు కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'గుంటూరు కారం'లో పూర్ణ చేసిన సందడి నెవర్ బిఫోర్ అని చెప్పవచ్చు. ఆ చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ 'కుర్చీ మడతపెట్టి'లో ఆమె వేసిన ఎనర్జిటిక్ మాస్ మూవ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తక్కువ స్క్రీన్ టైమ్ దక్కినప్పటికీ తన ప్రదర్శనతో సాంగ్‌కు మరింత ఎనర్జీ తీసుకువచ్చారు.
ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' చిత్రంలోనూ పూర్ణ తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన 'జైలర్ 2' ఫస్ట్ సింగిల్ ప్రోమోలో పూర్ణ తన డ్యాన్స్ మూవ్స్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ ప్రోమో బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ఆమె ప్రదర్శనపైనే గట్టి చర్చ నడుస్తోంది.
ఒకవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మరోవైపు కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్.. ఇలా ఇద్దరు అగ్ర కథానాయకుల భారీ ప్రాజెక్టులలో పూర్ణ స్పెషల్ సాంగ్స్ సాధించడం సాధారణ విషయమేమీ కాదు. నిడివి చిన్నదే అయినా, స్క్రీన్ పై కనిపించిన ఆ కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులలో బలమైన ముద్ర వేసేలా ఆమె ప్లాన్ చేసుకుంటున్న తీరు సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.
'జైలర్ 2' ప్రోమోలో పూర్ణ ఎంట్రీ సీక్వెన్స్‌ను మేకర్స్ ప్రత్యేకంగా హైలైట్ చేయడంతో ఈ పాటపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాటలో ఆమె ఎనర్జీ ఈ ట్రాక్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫుల్ సాంగ్ విడుదలైన తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు వెలుగులోకి రానున్నాయి.
కేవలం గ్లామరస్ రోల్స్ లేదా లీడ్ క్యారెక్టర్లకే పరిమితం కాకుండా, వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా పూర్ణ ముందుకు సాగుతున్నారు. స్క్రీన్ టైమ్ కంటే కంటెంట్ అండ్ ఇంపాక్ట్ ముఖ్యమని నిరూపిస్తున్న పూర్ణ రూట్ ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలోనే పూర్తి స్థాయి పాట విడుదల కానుండగా, రజనీకాంత్ మాస్ మేనియాతో పాటు పూర్ణ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో వేచి చూడాలి.
![]() |
![]() |