Home  »  News  »  లక్షమంది అమ్మాయిలకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ కానుక

Updated : Aug 17, 2026

 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ఆ పేరుకి ఉన్న వైబ్రేషన్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే పాన్ ఇండియా ఫ్యాన్స్, ప్రేక్షకులు మాకు తెలుసు అని ఆ వైబ్రేషన్ తాలూకు రికార్డుల గురించి పూస గుచ్చినట్టుగా చెప్తారు. అల్లు అర్జున్ ఇటీవల తన అభిమానులతో మీటింగ్ నిర్వహించి వాళ్లందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్  (AAFA) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సామాజిక సేవ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనతగా నిలిచింది.

మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణపై, దానిని అడ్డుకునే హెచ్‌పీవీ (HPV - Human Papillomavirus) వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. 'ఒక లక్ష మంది బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు' అనే ప్రధాన ఆశయంతో ముందడుగు వేసిన ఈ ఫ్యాన్స్ అసోసియేషన్, ఏకంగా 7 రాష్ట్రాల్లో 400కు పైగా అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మహోద్యమం ద్వారా పాఠశాలలు, కళాశాలలకు చెందిన 9 నుండి 26 సంవత్సరాల వయసు గల దాదాపు 1,00,000 మందికి పైగా బాలికలు, యువతులకు నేరుగా హెచ్‌పీవీ టీకాలపై సమగ్ర అవగాహన కల్పించారు.  అల్లు అర్జున్ ఇచ్చిన "ప్రతి ఏటా ఒక మంచి పని" (One Good Deed Every Year) అనే పిలుపునే స్పూర్తిగా తీసుకుని, వైద్య నిపుణుల సమక్షంలో యువతులకు సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాలు మరియు టీకా ద్వారా దానిని నిరోధించే విధానాలను చాలా స్పష్టంగా వివరించారు.

Also Read: ప్రస్తుతం ఏ సినిమా ఆడుతుందో, ఆడదో చెప్పలేని పరిస్థితి.. ప్రేక్షకుడా నీకు వందనం

సోషల్ మీడియాలో #AAFASupportsHPVDrive హ్యాష్‌ట్యాగ్‌తో ఈ అరుదైన సేవా కార్యక్రమం ట్రెండ్ అవుతోంది. కేవలం అభిమాన ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన సైన్యంగా మారి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కృషి నిజంగా అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వస్థ్ నారీ వికసిత్ భారత్' లక్ష్యానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ అల్లు అర్జున్  అభిమానులు ఈ అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించారు. 

 

Allu Arjun, Allu Arjun Fans, Hpv

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.