![]() |
![]() |
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల పర్సనల్ బాడీగార్డ్స్ వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. కానీ రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించిన కెవిన్ కుంటా పొందిన క్రేజ్ మాత్రం ఒక సంచలనం. అయితే తాజాగా సినీ వర్గాల్లో ఒక ఊహించని వార్త హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వెంటే నీడలా నిలిచిన కెవిన్ కుంటా, ఇకపై కింగ్ అక్కినేని నాగార్జున వద్ద పర్సనల్ బాడీగార్డ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఊపందుకుంది.
ఆఫ్రికన్ దేశమైన గాంబియాకు చెందిన కెవిన్ కుంటా అంతర్జాతీయ స్థాయిలో ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ (MMA) ఫైటర్‌గా సత్తా చాటారు. గత నాలుగేళ్లుగా రామ్ చరణ్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన బాడీగార్డ్‌గా సేవలందించిన ఆయన, ఇటీవల 'పెద్ది' సినిమా ప్రమోషన్స్ సమయంలో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ఈవెంట్ల వరకు చరణ్ వెంటే ఉంటూ తన ఎత్తైన కటౌట్, సిక్స్ ప్యాక్ పర్సనాలిటీతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నారు.
ఈవెంట్లలో అభిమానులు రామ్ చరణ్ వైపు దూసుకొచ్చినప్పుడు కెవిన్ తన పవర్ఫుల్ ప్రెజెన్స్‌తో గుంపును నియంత్రించిన శైలి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చరణ్ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో కెవిన్ పొందుతున్న క్రేజ్ గురించి సరదాగా మాట్లాడటంతో ఇతనికి భారీ స్థాయిలో క్రేజ్ పెరిగింది. ఒక్కో రోజుకు రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారనే వార్తలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి.
అయితే అత్యంత నమ్మకంగా పనిచేసిన ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్ ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి అక్కినేని నాగార్జున వద్దకు మారారని ప్రచారం జరగడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున తన రాబోయే ప్రాజెక్టుల ప్రమోషన్స్ మరియు పర్సనల్ సెక్యూరిటీ కోసం కెవిన్ కుంటా సేవలని వినియోగించుకోనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకున్న ఈ బాడీగార్డ్ టీమ్ చేంజ్ కావడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రామ్ చరణ్ దగ్గర అంత క్రేజ్ సాధించిన తర్వాత ఇప్పుడు నాగార్జున సెక్యూరిటీగా మారడం నిజమేనా అంటూ అక్కినేని, మెగా ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కెవిన్ కుంటా గానీ లేదా నాగార్జున పిఆర్ టీమ్ గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒక బాడీగార్డ్ కోసం ఈ స్థాయిలో చర్చ జరగడం టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన విషయమని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |