Home  »  News  »  'పాంచాలి పంచభర్తృక' మూవీ రివ్యూ

Updated : Aug 15, 2026

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, పృథ్వీ, రోల్ రైడా, సరీహ్ ఫార్, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు

కథ: బాబీ కేఎస్‌ఆర్‌
సంగీతం: మహేశ్ నారాయణ, బి షేక్
సినిమాటోగ్రఫీ: కేవీ ప్రసాద్
ఎడిటింగ్: జానీ బాషా నాగ
నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్ కోసర్ల, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం
దర్శకత్వం: గంగా సప్తశిఖర
విడుదల తేది: 14.08.26

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల హవా విపరీతంగా సాగుతోంది. అయితే కేవలం క్రైమ్, ఇన్వెస్టిగేషన్‌తో కాకుండా దానికి హిలేరియస్ కామెడీని జోడించి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సరిగ్గా ఇదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'పాంచాలి పంచభర్తృక'. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో విచిత్రమైన టైటిల్‌తో రూపొందిన పాంచాలి పంచభర్తృక చిత్రం, టీజర్, ట్రైలర్‌లతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆగస్ట్ 14న విడుదలైన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో తెలుసుకుందాం.

కథ:

డాక్టర్ దమయంతిని డాన్‌సన్ అనే ముఠా మనుషులు కిడ్నాప్ చేసి తమ అక్రమ వ్యాపారానికి సహకరించాలని బెదిరిస్తారు. మరోవైపు సీరియల్స్ తీసే చిత్తరంజన్ (జెమిని సురేష్) ఎలాగైనా ఒక సినిమా తీయాలనే పట్టుదలతో ఉంటాడు. ఈ క్రమంలోనే అద్దె ఇంటి కోసం వెతుకుతున్న కాట్‌రాజ్, పుష్పరాజ్‌లను తన అపార్ట్‌మెంట్ పెంట్ హౌస్‌లోనే ఉండమని ఆహ్వానిస్తాడు. సంతోషంగా కాలం గడుపుతున్న ఈ నలుగురు మిత్రులు ఒకరోజు రాత్రి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా 'సెనోరిటా' అనే అమ్మాయిని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటారు. ఆమె వచ్చి తన బాయ్‌ఫ్రెండ్ గురించి వారితో పంచుకున్న తర్వాత, ఈ నలుగురు ఓ పనిమీద బయటకు వెళ్లి వస్తారు. తీరా వచ్చి చూసేసరికి సెనోరిటా రక్తపు మడుగులో శవమై కనిపిస్తుంది. కంగారుపడిపోయిన ఆ నలుగురు, ఆ శవాన్ని ఒక సూట్‌కేసులో పెట్టి మాయం చేయాలని చూస్తారు. అయితే ఊహించని విధంగా ఆ శవంతో ఉన్న సూట్‌కేసు కూడా మాయమవుతుంది. అసలు ఆ సూట్‌కేసు ఎక్కడికి పోయింది? ఇందులో పరమసుందరి (రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఏమిటి? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు అలియాస్ ఎకో ఏం చేశాడు? అసలు సెనోరిటాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

విశ్లేషణ:

పాంచాలి పంచభర్తృక సినిమా ఒక క్రైమ్ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఒక మర్డర్ చుట్టూ కథనం తిరుగుతూ దానికి పాత్రలతో ఉన్న సంబంధం వంటి అంశాలతో సాగుతుంది. నిజానికి ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ స్టోరీనే. కానీ, కథనం మాత్రం నవ్విస్తూ, ఇంట్రెస్ట్ కలిగేలా లీనం చేస్తుంది. సినిమా ప్రారంభంలో యాక్టర్ సునీల్ వాయిస్ ఓవర్‌తో పాత్రలను పరిచయం చేసిన తీరు చాలా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల స్వభావాలు, నవ్వులు పూయించే కామెడీ సన్నివేశాలు, ఆపై సెనోరీటా మర్డర్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో అసలు హత్య ఎవరు చేశారు అనే పాయింట్‌పై నడిపిస్తూ ఎక్కడా గందరగోళం లేకుండా చిక్కుముడులను విప్పిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే రెండు అనూహ్యమైన ట్విస్ట్‌లు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయి.

న‌టీన‌టులు:

రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అలాగే పృథ్వి కూడా త‌న పాత్ర‌కు ఉన్న ప‌రిధిలో బాగానే న‌వ్వించారు. మిగ‌తా న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. జెమిని సురేష్‌కు చాలా కాలం తర్వాత మంచి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది.

సాంకేతిక నిపుణులు: 

మహేష్ నారాయణ, బీ షేక్ అందించిన టైటిల్ సాంగ్ బాగుంది. ఎడిటింగ్ కూడా కథకు తగినట్లుగా చాలా షార్ప్‌గా ఉండటం ప్లస్ పాయింట్. ఫోటోగ్ర‌ఫీ కూడా బాగుంది. ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ కూడా సినిమాకు త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. 

ప్ల‌స్ పాయింట్స్:

క‌థ‌, స్క్రీన్‌ప్లే
న‌టీన‌టుల పెర్‌ఫార్మెన్స్‌
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

మైన‌స్ పాయింట్స్:

రెగ్యుల‌ర్‌గా అనిపించే కొన్ని సీన్స్‌
రిపీటెడ్ సీన్స్‌
పాట‌లు

ఫైనల్‌గా చెప్పాలంటే..

వీకెండ్‌లో హాయిగా నవ్వుకోవడానికి, సస్పెన్స్ ఎంజాయ్ చేయడానికి పాంచాలి పంచభర్తృక సినిమాపై ఓసారి లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.75/5






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.