![]() |
![]() |

ఒక నాన్ తెలుగు సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం ఎప్పుడైనా చూశారా?. కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన మేనియాని చాటుకున్న రాకింగ్ స్టార్ యశ్.. ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' బిజినెస్ డీల్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్‌లోని బడా నిర్మాతలు పోటీ పడగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఆ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏకంగా రూ.120 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఒక డబ్బింగ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో లభించిన బిజినెస్ డీల్స్‌లో ఇది ఆల్‌టైమ్ రికార్డ్.
యశ్ గత చిత్రం 'కేజీఎఫ్-2' తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అందుకే దిల్ రాజు రిస్క్ చేసి, ఇంత భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్. అయితే సినిమా మీద ఎంత హైప్ ఉన్నప్పటికీ.. తెలుగు స్టార్ హీరోల బిజినెస్ తలదన్నేలా ఏకంగా రూ.120 కోట్ల డీల్ అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంత అనేది త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Yash Toxic, Telugu Rights, Dil Raju, 120 Crore
![]() |
![]() |