![]() |
![]() |

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్'. థియేటర్లలో తన రన్ పూర్త చేసుకున్న ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది. అనుకున్నట్లుగానే ప్రముఖ ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 లో ఈ చిత్రం ఈ రోజు నుండి అధికారికంగా స్ట్రీమింగ్ కావడం ప్రారంభమైంది. అయితే ఈ డిజిటల్ ప్రీమియర్ ప్రస్తుతం కేవలం తెలుగు భాషలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
వాస్తవానికి ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ZEE5 సంస్థ గతంలోనే ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఆగస్టు 7 నుండి 'లెనిన్' సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం వంటి నాలుగు ప్రధాన దక్షిణాది భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెంచింది. కానీ ఊహించని విధంగా స్ట్రీమింగ్ మొదలైన సమయానికి కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారమవుతోంది.
తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల కావడం, ఇతర భాషల వెర్షన్లు కనిపించకపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనే దానిపై ఇప్పటివరకు ZEE5 సంస్థ కానీ, 'లెనిన్' చిత్ర నిర్మాతలు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డబ్బింగ్ ఆలస్యం కారణం అయ్యుంటుంది అంటున్నారు.
ఏది ఏమైనా తెలుగులో ఓటీటీ అందుబాటులోకి వచ్చిన లెనిన్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ.. ఓటీటీలోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉంది.
Akhil Akkineni, Lenin Movie, OTT
![]() |
![]() |