Home  »  News  »  రామ్ చరణ్ క్షేమం కోసం ఉపాసన కీలక నిర్ణయం.. పిక్స్ వైరల్ 

Updated : Jul 28, 2026

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కుడి చేతి మణికట్టుకి  (రైట్ రిస్ట్) కోయంబత్తూరులోని  గంగా హాస్పిటల్‌లో జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. చరణ్ ఆసుపత్రిలో ఉన్నంత సేపు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా అక్కడే ఉన్నారు


శస్త్రచికిత్స ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావడంతో ఉపాసన   సోమవారం తెల్లవారుజామునే  పలు ప్రాచీన ఆలయాలని  దర్శించుకుని గణపతి, హనుమాన్ స్వామి వార్లకి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో తాను చేసిన పూజల ఫోటోలని  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, భర్త సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వేడుకున్నట్లు తెలిపారు. ఉపాసన(Upasana) చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రార్థనలు మరియు మెగా అభిమానుల అపారమైన ప్రేమ, ఆశీస్సులు చరణ్‌ను త్వరగా కోలుకునేలా చేస్తున్నాయని కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


Also read: Shah Rukh Khan: సినిమా వేలంపాటలో పాల్గొన్న షారుఖ్.. దటీజ్ సినిమా 

శస్త్రచికిత్స అనంతరం వైద్యులు రామ్ చరణ్‌కు కనీసం 8 నుంచి 10 వారాల పాటు  ఫిజియోథెరపీ తీసుకోవడంతో పాటు ఎక్కువగా విశ్రాంతిని తీసుకోవాలని సూచించారు . ప్రస్తుతం ఆయన కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ చేరుకుని వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విశ్రాంతి సమయం పూర్తయి, వైద్యుల నుంచి పూర్తి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించిన తర్వాతే సుకుమార్ మూవీని స్టార్ట్ చేస్తాడు. పెద్ది సినిమా చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తీవ్రమైన గాయానికి గురయ్యారు. సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాల్లో దాదాపు 25 నుంచి 30 రోజుల పాటు నిజమైన రెజ్లర్లతో (పహిల్వాన్లు) కుస్తీ పోటీల షూటింగ్ నిర్వహించారు. ఆ సమరంలో రియల్ పహిల్వాన్లు గట్టిగా పట్టుకోవడంతో చరణ్ కుడి చేతి మణికట్టులోని మృదులాస్థి  తీవ్రంగా దెబ్బతింది. ప్రారంభంలో ఒక్క చోట మాత్రమే కార్టిలేజ్ టియర్ (Cartilage Tear) ఏర్పడినప్పటికీ, సినిమా చిత్రీకరణను ఆపకుండా అలాగే 20 రోజుల పాటు ఆ నొప్పితోనే షూటింగ్ కొనసాగించారు. దానివల్ల ఆ ఒక్క టియర్ కాస్తా ఏడు చోట్లకు విస్తరించి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అయినప్పటికీ సినిమా పట్ల ఉన్న అంకితభావంతో చరణ్ ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు చికిత్సని  వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కోయంబత్తూర్ లో ఆపరేషన్ చేయించుకున్నాడు.

Ram Charan, Upasana, Chiranjeevi

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.