Home  »  News  »  విజయ్ ఆంటోనీ బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి ‘వంద దేవుళ్ళు’ మూవీ.!

Updated : Jul 24, 2026

విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన రీసెంట్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వంద దేవుళ్ళు' ఆగస్టులో తమ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుందని ZEE5 తెలుగు ప్రకటించింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. 

ఇటీవల విడుదలైన 'పరిమళ & కో' ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. జయరామ్, ఊర్వశి నటించిన ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని రకాల అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇప్పుడు ZEE5 తెలుగు ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు 'వంద దేవుళ్ళు'తో ముందుకు వస్తోంది. ఇది ఫ్యామిలీ అంతటినీ ఒకచోట చేర్చే సామర్థ్యం ఉన్న చిత్రం. ఈ మూవీలోని భావోద్వేగాలు పూర్తిగా భిన్నమైనవి.

నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన 'వంద దేవుళ్ళు' చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది.

తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు.

 

Vijay Antony, Vanda Devullu, OTT Update, ZEE5

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.