![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna).. ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుందంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమా చేసే చిందులని చూడటానికి రెండు కళ్ళు చాలవు. మాస్ అభిమానుల ఆనందాన్ని చూస్తే తెలుగు సినిమా ఎంత అదృష్టం చేసుకుందో కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari).తెలుగు సినిమా ఒడిలో ఒదిగిన మణిహారం లాంటి మూవీ. సువాసనలతో కూడిన ఈ చిత్రం తాలూకు వైభవం సాంగ్స్ నేటికీ మారుమోగిపోతుంటాయి. విలన్, భారీ ఫైట్స్, చేజింగ్స్, రణగొన ధ్వనులు అంటూ లేని ఈ మూవీ బాలయ్య తన నట జీవితం మొత్తంలో ఎనీ టైం సగర్వంగా చెప్పుకొనే మూవీ కూడా. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన లొకేషన్ విషయానికి వస్తే, చెన్నైలోని వేలచ్చేరి ఏరియాలో చిరంజీవికి 'హనీ హౌస్' పేరుతో ఎంతో ఇష్టమైన భారీ గెస్ట్ హౌస్ ఉండేది. 'నారీ నారీ నడుమ మురారి' కి సంబంధించిన షూటింగ్ ని 90 శాతం చిత్రీకరణని ఈ చిరంజీవి గెస్ట్ హౌస్‌లోనే పూర్తి చేశారు.ఆ హౌస్ పక్కనే దాదాపు 2 ఎకరాల విశాలమైన భూమి కూడా చిరు దే. ఆ ల్యాండ్ ని సైతం చిత్ర యూనిట్ ఉపయోగించుకుంది. ఒక అగ్ర హీరో సినిమా షూటింగ్ కోసం మరో అగ్ర హీరో తన ప్రియమైన గెస్ట్ హౌస్‌ను సంతోషంగా కేటాయించడం ఆ ఇద్దరి మధ్య ఉన్న గొప్ప అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏ పాటిదో మరో సారి ఇరువురి అభిమానులకి తెలిసొచ్చింది.
Also read: jana nayakudu: జన నాయకుడు తెలుగు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ !
బాలకృష్ణ నుంచి 1990 సంక్రాంతికి విడుదలైన 'ప్రాణానికి ప్రాణం' మూవీ ఫ్లాప్ కావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో, ఏప్రిల్ 27న విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' హిట్ అయి వారికి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ మూవీ విడుదలైన సరిగ్గా 12 రోజులకి చిరంజీవి నుంచి 'జగదేకవీరుడు అతిలోకసుందరి' విడుదలైంది. ఆ చిత్రం విజయ ప్రభంజనాన్ని నారీ నారీ నడుమ మురారి తట్టుకొని నిలబడి వంద రోజులు పూర్తి చేసుకుంది..కేవీ మహదేవన్ స్వరపరిచిన పాటలు అన్నీ హిట్టే. చిత్రం విడుదలకు ముందే భారీ స్థాయిలో క్యాసెట్లు అమ్ముడై గోల్డ్ డిస్క్ అందుకుంది. 11 మంది రచయితలు 28 నెలల పాటు చర్చలు జరిపి తయారు చేసిన కథ ఇది. ఫైట్స్, బ్రేక్ డ్యాన్సులు లేకుండా వచ్చి 45 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.. బాలయ్య కి 50 వ చిత్రం. శోభన, నిరోషా హీరోయిన్స్ గా చేయగా, శారద, కైకాల సత్యనారాయణ కీ రోల్స్ లో కనిపించారు.
chiranjeevi, balakrishna, nari nari naduma murari

![]() |
![]() |