Home  »  News  »  'చెన్నై లవ్ స్టోరీ' షాకింగ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే.?

Updated : Jul 23, 2026

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన సరికొత్త ప్రేమకథా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. 'కలర్ ఫోటో', 'బేబీ' వంటి సంచలన విజయాల తర్వాత నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం, ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి. 

డిఫరెంట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాన్ని సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మేకర్స్ అనుసరించిన పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీ, పాటలకు లభించిన ఆదరణ కారణంగా ఈ సినిమాకు బిజినెస్ వర్గాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెటింది. 

ఈ చిత్రం సాధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే, ఓటీటీ డిజిటల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.15 కోట్ల మేర భారీ ఆఫర్ దక్కగా, ఆడియో రైట్స్ రూపంలో మరో రూ.5 కోట్లు సమకూరాయి. అంటే కేవలం నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే మేకర్స్‌కు మొత్తంగా రూ.20 కోట్ల ఆదాయం లభించింది. 

ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.15 కోట్ల మేర జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్కన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.35 కోట్లకు చేరుకుని, నిర్మాతలు విడుదల కంటే ముందే సుమారు రూ.20 కోట్ల భారీ ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టేలా చేసింది.

థియేట్రికల్ బిజినెస్ రూ.15 కోట్లుగా నమోదవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ నాటికే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి క్లీన్ హిట్ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 

 

Kiran Abbavaram, Chennai Love Story, Business, Box Office

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.