Home  »  News  »  నా జీవితం నా ఇష్టం.. ఆ హీరోకి బ్రేకప్ చెప్పేసిన అనుపమ పరమేశ్వరన్.?

Updated : Jul 19, 2026

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సైలెంట్ గా ఉండే ఈ బ్యూటీ, ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ తో ఫిలిం నగర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను అనుభవించిన ఒక బంధం నుంచి బయటపడి, స్వేచ్ఛను వెతుక్కున్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ మీడియాలో సైతం తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ పోస్ట్ వచ్చిన కొద్ది గంటల్లోనే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తో అనుపమ బ్రేకప్ జరిగిందంటూ వార్తలు జోరందుకున్నాయి.

గతంలో ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ ల మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారిందనే ప్రచారం సినీ వర్గాల్లో గట్టిగా సాగింది. అంతేకాదు, గతంలో వీరిద్దరికీ సంబంధించిన ఒక ఆఫ్ స్క్రీన్ కిస్సింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ కి మరింత బలం చేకూరింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అనుబంధం సరిగ్గా సాగడం లేదని, తాజాగా ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయి వారి వ్యక్తిగత జీవితాల్లో ముందుకు సాగుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసేలా అనుపమ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తను పెట్టిన భావోద్వేగభరితమైన పోస్టులో అనుపమ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. కొన్నిసార్లు మన జీవితంలో డెడ్ ఎండ్స్ కి చేరుకున్న బంధాలను వదిలేస్తేనే నిజమైన ప్రశాంతత లభిస్తుందని, ఈరోజు తనకు ఆ ప్రశాంతత దొరికిందని రాసుకొచ్చింది. ఇప్పటివరకు తను ఎదుర్కొన్న పరిస్థితులపై స్పందిస్తూ.. ఇకపై తన జీవితాన్ని, తన గొంతును తనే ఎంచుకుంటానని స్పష్టం చేసింది. ఇక నుంచి ఎవరి అనుమతులు అవసరం లేదని, ఎలాంటి భయం లేకుండా బతుకుతానని పేర్కొంది. ఒకప్పుడు తనదైన జీవితాన్ని తనే దాదాపు మర్చిపోయానని, ఇప్పుడు మళ్లీ నా జీవితంతో నేను ప్రేమలో పడుతున్నానని ఎమోషనల్ అయ్యింది. ఇన్నాళ్లూ తాను చెప్పాలనుకున్నా చెప్పలేకపోయిన మాటను ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నానంటూ, అభిమానులందరికీ లవ్ యూ అంటూ కృతజ్ఞతలు తెలిపింది.

ధృవ్ విక్రమ్ తో ప్రేమలో ఉన్నప్పుడు అనుపమ హ్యాపీగా లేదని, అతను తన కంట్రోల్ పెట్టుకోవడానికి చూసుంటాడని, అందుకే అనుపమ విడిపోయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అనుపమ, తెలుగులో హీరో శర్వానంద్ సరసన డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ డ్రామా "భోగి" సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కందుల సులోచనా రాణి అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనుంది. 

https://www.instagram.com/reel/Da8ENlupMSX/

 

 

Anupama Parameswaran, Dhruv Vikram, Breakup

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.