Home  »  News  »  ఆ కంటెంట్ వేరే లెవెల్.. నాని ‘ది ప్యారడైజ్’ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే.?

Updated : Jul 16, 2026

నేచురల్ స్టార్ నాని ప్రతి సినిమాతోనూ తన పరిధిని విస్తరించుకుంటూ, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం నాని నటన కోసమే కాకుండా, ఈ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ కూడా అసాధారణంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ భారీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా రెండు  ప్రొడక్షన్ యూనిట్లు రేయింబగళ్లు శ్రమిస్తుండటం ఇక్కడ విశేషం. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ వెనుక ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నవకాంత్ మాస్టర్ శ్రమిస్తున్నారు. నవకాంత్ మాస్టర్ నేతృత్వంలో డిజైన్ చేసిన ఈ ఫైట్ సీక్వెన్స్ సరికొత్త యాక్షన్ స్టైల్‌తో థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. 

ఈ హై-వోల్టేజ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిన వెంటనే, చిత్రబృందం ఒక అదిరిపోయే మాస్ ఐటమ్ సాంగ్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాకుండా, థియేటర్లలో మాస్ ఆడియన్స్‌తో డ్యాన్స్ చేయించడం ఖాయంగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు వేగవంతం చేశారు.

అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి, విడుదల ఆలస్యం గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చవుతోందని, షూటింగ్ మరింత లేట్ అవుతోందని కామెంట్స్ వస్తున్నప్పటికీ, కంటెంట్ విషయంలో చిత్రబృందం ఎంతో నమ్మకంతో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ శాంపిల్స్ రషెస్ చూసిన కొద్దిమంది పరిశ్రమ పెద్దలు "ప్యూర్ మ్యాడ్‌నెస్ లోడింగ్" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఫస్ట్ షో పడిన తర్వాత థియేటర్ల నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి అందరి నోళ్లు మూతపడతాయని, ఆ కంటెంట్ ఏంటి, ఆ అద్భుతమైన మేకింగ్ ఏంటి, నాని విశ్వరూపం ఏంటి అని కథలు కథలుగా చెప్పుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని రేంజ్ పూర్తిగా మారిపోవడం, ఆయన నెక్స్ట్ లీగ్ స్టార్‌గా ఎదగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

 

The Paradise, Nani, Srikanth Odela, TeluguOne

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.