![]() |
![]() |

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. కేవలం కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోయే హీరోల కంటే, సినిమాకి సంబంధించిన అన్ని విషయాలని దగ్గరుండి చూసుకునే ఆల్‌రౌండర్లకే ఇండస్ట్రీలో క్రేజీ డిమాండ్ ఏర్పడింది. నటనతో పాటు సొంతంగా కథలు రాయడం, స్క్రీన్ ప్లే సమకూర్చడం, ఎడిటింగ్ టేబుల్ పై కూర్చోవడం, డైలాగ్స్ రాయడం వంటి మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు ఉండాలి. ఆ విధంగా ఉండే యువ నటుల వైపు దర్శక నిర్మాతలు మాత్రమే కాదు, దిగ్గజ ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.
తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఇలాంటి అరుదైన ప్రతిభ ఉన్న ఒక టాలెంటెడ్ యంగ్ హీరోకి ఒక ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ ఏకంగా అక్షరాలా 9 కోట్ల భారీ ప్యాకేజీ ఆఫర్ చేసి సినిమా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సదరు యంగ్ హీరో కెరీర్ లోనే ఇదే అత్యధిక పారితోషికం కావడం కూడా గమనార్హం. అయితే ఈ 9 కోట్ల రూపాయల భారీ డీల్ వెనుక ఒక ఆసక్తికరమైన కండిషన్ దాగి ఉంది. ఈ ఒప్పందం ప్రకారం, ఆ హీరో ఒక సరికొత్త కథని స్వయంగా సిద్ధం చేసుకోవాలి. ఆ కథకి సరిగ్గా సరిపోయే ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిని అతడే వెతికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అవసరమైతే ఆ చిత్రానికి తానే స్వీయ దర్శకత్వం వహించి నటించాల్సి ఉంటుంది. నమ్మకమైన నిర్మాతను వెతికి తెచ్చే బాధ్యతని కూడా ఓటీటీ సంస్థ సదరు హీరో భుజాలపైనే పెట్టింది. వీటన్నింటికీ ప్రతిఫలంగానే ఓటీటీ సంస్థ ఆ హీరోకు 9 కోట్లు సమర్పించుకోనుంది.
ఈ డీల్‌కు ప్రతిగా సదరు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆ సినిమాకు సంబంధించిన పూర్తి ఓటీటీ హక్కులను తమ పేరిట రాయించుకుంటుంది. థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా కొంత మేర వాటాను సొంతం చేసుకుంటుంది. మిగిలిన వ్యాపార లావాదేవీలు మరియు వాటాల లెక్కలను ఆ హీరో, అతను తీసుకువచ్చే ఒరిజినల్ నిర్మాత స్వయంగా మాట్లాడుకుని తేల్చుకుంటారు. ఈ విషయాలతో ఓటీటీ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుతం సదరు యువ హీరో నటించిన ఒక క్రేజీ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి ఫలితం తేలిన వెంటనే, ఈ సరికొత్త 9 కోట్ల ప్యాకేజీ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగి రాతకోతలు పూర్తవుతాయి.
Also read: వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులని ఆ అగ్ర నిర్మాత ఎంత అమౌంట్ కి అడిగాడో తెలుసా!
సాధారణంగా ఈ రోజుల్లో ఒక కొత్త సినిమాకు థియేట్రికల్ విడుదలకు ముందే మంచి ఓటీటీ ఒప్పందం కుదరడం అంటే గగనమనే చెప్పాలి. అలాంటిది సినిమా పట్టాలెక్కక ముందే, కేవలం హీరో ప్రతిభను నమ్మి ఏకంగా 9 కోట్ల రూపాయల డీల్ కుదరడం తెలుగు చిత్రసీమలో ఒక అరుదైన రికార్డు. ఈ స్థాయిలో ఓటీటీ డీల్ ముందే ఖరారవ్వడంతో, అతనితో సినిమా చేయడానికి ఏ నిర్మాత అయినా రెడ్ కార్పెట్ పరచడం ఖాయం. పైగా ఆ హీరో వెనుక ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అగ్ర నిర్మాతలు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
![]() |
![]() |