![]() |
![]() |

ఇళయ దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జాసన్ సంజయ్ పేరు ఇప్పుడు సౌత్ సినిమా సర్కిల్స్‌లో మారుమోగిపోతోంది. సాధారణంగా స్టార్ కిడ్స్ అనగానే కెమెరా ముందుకు వచ్చి హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటాం. కానీ సంజయ్ మాత్రం అందుకు బిన్నంగా డైరెక్షన్ ఎంచుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మాణంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా సంజయ్ తెరకెక్కించిన తొలి చిత్రం 'సిగ్మా'. హాలీవుడ్ రేంజ్ యాక్షన్, ఇంటెన్స్ ట్రెజర్ హంట్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందగా జూలై 31న వరల్డ్ వైడ్ విడుదలకు సిద్ధమవుతోంది.
తమిళ ఇండస్ట్రీలో తాజాగా వినిపిస్తున్న బిగ్గెస్ట్ గాసిప్ ఏంటంటే.. డైరెక్టర్‌గా 'సిగ్మా' ప్రాజెక్ట్‌ని విజయవంతంగా పూర్తి చేసిన జాసన్ సంజయ్, ఇప్పుడు నటుడిగా మారేందుకు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నాడట. తమిళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రముఖ మేకర్ తమిళ కుమారన్ ప్రస్తుతం సంజయ్ నటన రంగప్రవేశం కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. తండ్రి ఇమేజ్‌ను లేదా ఆయనకున్న కోట్లాది మంది ఫ్యాన్స్ సపోర్ట్‌ను నమ్ముకోకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చే కథతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని సంజయ్ భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే 8.7 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన 'సిగ్మా' టీజర్ సంజయ్ మేకింగ్ స్టైల్‌కు అద్దం పట్టింది.
also read: Ramyakrishna: రమ్యకృష్ణ సీక్రెట్ లీక్.. లీక్ చేసింది శృతిహాసన్ అని నిర్దారణ
అయితే, సంజయ్ 'సిగ్మా' సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న తరుణంలోనే కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక రసవత్తరమైన క్లాష్ నెలకుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'DC' (డిటెక్టివ్ ఐపీఎస్) సినిమా కూడా సరిగ్గా ఇదే జూలై 31వ తేదీన విడుదలకు సిద్ధం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దళపతి విజయ్‌తో లోకేష్ కనకరాజ్‌కు ఉన్న 100 శాతం సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది విజయ్ కొడుకు మొదటి సినిమాకే లోకేష్ పోటీగా రావడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? లేక ఇది కేవలం 2026 బాక్సాఫీస్ యాదృచ్ఛికమా? అనే చర్చలు నడుస్తున్నాయి. పైగా 'సిగ్మా' హీరో సందీప్ కిషన్ సరసన లోకేష్ కనకరాజ్ గతంలో 'మానగరం' వంటి హిట్ సినిమాలో కలిసి పని చేయడం విశేషం. ఇప్పుడు అదే సందీప్ కిషన్ వర్సెస్ లోకేష్ కనకరాజ్ అన్నట్లుగా ఈ క్లాష్ మారిపోయింది.
![]() |
![]() |