Home  »  News  »  Tamannaah: తమన్నాకి తెలుగులో అవకాశాలు లేవా.. ఆ మూవీ ఎఫెక్ట్ నిజమేనా!

Updated : Jul 13, 2026

 


టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ, మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటి తమన్నా భాటియా. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన తమన్నా కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మకు, ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు దాదాపు శూన్యమయ్యాయనే వార్తలు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. 


ప్రీవియస్ మూవీ ఓదెల 2 ఇరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కగా  తమన్నా మొదటిసారి అఘోరీ (శివశక్తి) పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడినప్పటికీ, కమర్షియల్‌గా ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.7.07 కోట్ల లైఫ్‌టైమ్ బాక్సాఫీస్ వసూళ్లను మాత్రమే రాబట్టగలిగిన ఈ చిత్రం, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ 2.75 రేటింగ్ యావరేజ్ రివ్యూల ప్రభావం తమన్నా తదుపరి తెలుగు అవకాశాలపై తీవ్రంగా పడింది. కనీసం కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ (ఐటెం సాంగ్స్) ఆఫర్లు అయినా వస్తాయా అంటే, ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ ఆమె వైపు చూసేందుకు ఆసక్తి చూపడం లేదనే టాక్ నడుస్తోంది.


Also read: Mahesh babu: మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాక్ గ్యారంటీ

తెలుగులో మార్కెట్ తగ్గినప్పటికీ, బాలీవుడ్, ఓటీటీ స్పేస్ మాత్రం తమన్నాకి  కొత్త ద్వారాలు తెరుస్తోంది. అక్కడ ఆమెకు మంచి వెబ్ సిరీస్ ఆఫర్లతో పాటు గ్లామరస్ రోల్స్ లభిస్తున్నాయి. కానీ, ఒకప్పుడు టాలీవుడ్‌ను శాసించిన ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు తెలుగులో ఒక్క క్రేజీ ప్రాజెక్ట్ కూడా లేక ఖాళీగా ఉండటం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. సినిమా సక్సెస్ రేట్ ఆధారంగానే అవకాశాలు ఇచ్చే టాలీవుడ్ నైజం వల్ల, 'ఓదెల 2' ఫ్లాప్ తర్వాత తమన్నా కెరీర్ గ్రాఫ్ తెలుగులో పడిపోయిందనేది పచ్చి నిజం. మరి రాబోయే రోజుల్లో ఈ మిల్కీ బ్యూటీ ఏదైనా బలమైన కంబ్యాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.