![]() |
![]() |

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ "టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్". భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ రోమాంటిక్ సింగిల్ వీడియో సాంగ్ ‘తబాహి’ విడుదలైంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధిస్తూ, బిగ్ స్క్రీన్స్‌పై సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ‘తబాహి’ వీడియో సాంగ్‌లో రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సముద్రతీరంలో తీసిన అద్భుతమైన విజువల్స్, నటీనటుల మధ్య ఉన్న ఇంటెన్సిటీ ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చాయి. గతంలో ఈ సినిమా నుండి ఆడియో మాత్రమే విడుదల కాగా, ఇప్పుడు మేకర్స్ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట సూఫీ తత్వవేత్త రూమి రాసిన ప్రముఖ కోట్‌తో ప్రారంభం కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా స్వరపరిచిన ఈ అద్భుతమైన మెలోడీ సాంగ్‌కు తెలుగులో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.
దాదాపు 500 నుండి 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీతో పాటు స్టార్ హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుండగా తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణీ వసంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త టీజర్ ‘లేడీస్ అండ్ లేడీస్’ ఇటీవల విడుదలై, ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. ఈ టీజర్‌లో ఐదుగురు హీరోయిన్లను పరిచయం చేస్తూ సినిమాలోని బోల్డ్, యాక్షన్ ఎలిమెంట్స్ ను చూపించారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్, యశ్ సంయుక్తంగా కథను అందించారు. ఈ సినిమాను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Toxic Movie, Tabaahi Song, Yash, Kiara Advani
![]() |
![]() |