Home  »  News  »  Ghattamaneni jaya krishna: స్టార్ మెటీరియల్ గా నిలుస్తాడా?

Updated : Jul 8, 2026


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న కెపాసిటీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. నడుస్తున్న సినీ చరిత్రకి సజీవ సాక్ష్యం. సూపర్ స్టార్ కృష్ణ గారు తన అద్భుతమైన నటనతో, సాహసోపేతమైన ప్రయోగాలతో కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్‌ని ఏలారు. ఇండియాలో అత్యధిక అభిమాన సంఘాలు గల ఏకైక హీరో కూడా. ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ టాగ్ లైన్ మాదే అంటూ రికార్డుల రారాజుగా కొనసాగుతూ వస్తున్నాడు.

ఇప్పుడు అదే ప్రతిష్టాత్మక కుటుంబం నుండి మూడో తరం వారసుడు మహేష్ అన్నయ్య   రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' తో హీరోగా పరిచయమవుతున్నాడు . ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో జయకృష్ణ టాలీవుడ్‌లో తదుపరి సూపర్ స్టార్ లేదా 'స్టార్ మెటీరియల్' గా నిలుస్తాడా అనే ఆసక్తికరమైన చర్చ పరిశ్రమ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

జయకృష్ణ కేవలం ఒక స్టార్ వారసుడిగా మాత్రమే కాకుండా, సినిమా రంగానికి కావాల్సిన పూర్తి సన్నద్ధతతో రంగ ప్రవేశం చేస్తున్నాడు. అమెరికాలో నటన, అనుబంధ విభాగాల్లో ఇంటెన్సివ్ యాక్టింగ్ కోర్సు పూర్తి చేసుకుని పక్కా ప్లానింగ్‌తో ఇండియాకి  తిరిగొచ్చాడు. ఇటీవల విడుదలైన 'శ్రీనివాస మంగాపురం' యాక్షన్ గ్లింప్స్,  టీజర్, సాంగ్ చూస్తే జయకృష్ణలో ఉన్న ఈజీ  స్క్రీన్ ప్రెజెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లవ్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో ప్రదర్శించిన ఎనర్జీ లెవెల్స్ చూసి అభిమానులు  ఫిదా అవుతున్నారు. లుక్స్ అచ్చం బాబాయ్ మహేష్ బాబు లాగే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో వాసు బాబు అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో జయకృష్ణ కనిపించబోతున్నాడు. ఒకప్పటి  బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ హీరోయిన్‌గా టాలీవుడ్ డెబ్యూ ఇస్తుండటం అంచనాలని మరింత పెంచేసింది.


Also read: aamir khan: అమీర్ ఖాన్ భార్య మెడలో హైదరాబాదీ పఠానీ.. వైరల్ అవుతున్న న్యూస్ 

ఒక కొత్త హీరో.కి  ఇంతకంటే బెస్ట్ లాంచ్ ప్యాడ్ దొరకడం చాలా అరుదు. ఘట్టమనేని కుటుంబానికి ఎంతో కలిసివచ్చిన లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. దాదాపు 41 సంవత్సరాల క్రితం కృష్ణ గారితో అగ్నిపర్వతం సినిమా తీసిన అశ్వినీదత్, ఆ తర్వాత 1999 లో రాజకుమారుడు మూవీతో మహేష్ బాబుని  హీరోగా పరిచయం చేశారు. ఇప్పుడు అదే బ్యానర్ సెంటిమెంట్‌తో జయకృష్ణను లాంచ్ చేస్తుండటం ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా, సీనియర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్ వెంకటప్పనాయుడు గా చేస్తుండటం అదనపు క్రేజ్. నరేష్, బ్రహ్మాజీ, అజయ్ లాంటి భారీ స్టార్ కాస్ట్  ఉండటం  కూడా ప్లస్ పాయింట్. ఈ నెల 30న రాబోతున్న శ్రీనివాస మంగాపురంతో జయకృష్ణ ఘట్టమనేని వంశ ఘనకీర్తిని ఏ మేరకు ముందుకు తీసుకెళ్తాడో, టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ స్టార్‌గా ఎలా నిలదొక్కుకుంటాడో చూడాలి.

jaya krishna, krishna, mahesh, rameshbabu






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.