![]() |
![]() |

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సరసన జోడి కట్టాలనేది ఎంతో మంది హీరోయిన్స్ కల. అలాంటి కలని కనడానికి కొంచం టైం పట్ట్టే అవకాశం ఉన్నా కూడా అనుకోకుండా ప్రభాస్ తో 'ఫౌజీ' లో జోడి కట్టే ఛాన్స్ దక్కించుకుంది ఇమాన్వి(Imanvi). 1940ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో ఇమాన్వి మెరిసినప్పుడు, ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ కొత్త భామపైనే పడింది. ఆమె అందం, ప్రత్యేకించి హను రాఘవపూడిని ఆకట్టుకున్న ఆమె భావగర్భితమైన కళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.
అయితే, ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభమై నెలలు గడుస్తున్నా, ఇమాన్వి ఇప్పటివరకు మరో కొత్త తెలుగు సినిమాపై సంతకం చేయకపోవడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన హీరోయిన్‌గా అనౌన్స్ అయిన వెంటనే, ఇతర పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోల సినిమాల నుంచి వరుస ఆఫర్లు రావడం సర్వసాధారణం. కానీ, ఇమాన్వి విషయంలో అలా జరగకపోవడంతో టాలీవుడ్ లైనప్‌లో ఆమె పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏంటా అని ఆరా తీయగా, ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, 'ఫౌజీ' చిత్ర నిర్మాతలు ఇమాన్వితో ఒక ప్రత్యేకమైన అగ్రిమెంట్ లేదా బాండ్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారం, ఈ చిత్రం పూర్తయి థియేటర్లలో విడుదలయ్యే వరకు ఆమె మరే ఇతర తెలుగు సినిమాను అంగీకరించకూడదు, వేరే ప్రాజెక్టులపై సంతకం చేయకూడదు. ఈ కఠినమైన క్లాజ్ వల్లే ఆమెకు ఆఫర్లు వస్తున్నప్పటికీ నిబంధనల ప్రకారం వేరే సినిమాలకి కమిట్ కాలేకపోతోందని గట్టిగా వినిపిస్తోంది. హను రాఘవపూడి తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా, విభిన్నంగా డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో ఇమాన్వి క్యారక్టర్ కి సంబంధించిన లుక్, లీడ్ ఎలిమెంట్స్ చాలా రహస్యంగా ఉంచాలని, సినిమా రిలీజ్ వరకు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ వేరే ఎక్కడా రివీల్ కాకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also read: Ravi teja: వీరాధి వీరులంట.. నిజమవుతుందా మరి!
ప్రస్తుతం 'ఫౌజీ' సినిమాకు సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్స్ షూటింగ్ పెండింగ్‌లో ఉంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం, రాబోయే ఆగస్టు నెలలో రెబల్ స్టార్ ప్రభాస్ తిరిగి ఈ చిత్ర యూనిట్‌తో కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, అభిమానుల కోసం ఒక అదిరిపోయే గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కంటెంట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంది.
prabhas, imanvi, fauji, hanu raghavapudi
![]() |
![]() |