![]() |
![]() |

తెలుగు సినిమాని ఒక ఊపు ఊపిన, చూపు చూసిన నటుడు బాబూమోహన్(Babu Mohan). బాబూమోహన్ పలానా సినిమాలో ఉన్నాడురా అని మూవీకి వెళ్లే ప్రేక్షకుల నెంబర్ కి లెక్కే లేదు. తన కామెడీ తో తెలుగు వాళ్ళని పొట్టచెక్కలయేలా నవ్వించి చిన్న చిన్న రోగాలని కూడా మటుమాయం చేసిన లెజండ్రీ యాక్టర్. రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల కొంతకాలం వెండితెరకి దూరమైన ఈ అద్భుత నటుడు, ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చి వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయారు.
బాబూమోహన్ రీసెంట్ గా కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులు ఆయనకి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతు నేను ప్రస్తుతం ఏకంగా 15 సినిమాల్లో నటిస్తున్నాను. అంతేకాదు ఆ 15 చిత్రాలలో ఇప్పటికే 8 సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రాలలో కనీసం 5 సినిమాల్లో పూర్తి స్థాయి నిడివి గల క్యారెక్టర్స్ లో కనిపిస్తాను. అవి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తాయి. రాబోయే రోజుల్లో థియేటర్లలో తన మార్కు కామెడీతో పాత రోజులను గుర్తు చేస్తాను.
Also read: sanjay dutt: నేను క్యాన్సర్ బారిన పడ్డాను.. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగం
ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రాబోయే మూవీలో అయితే డైలాగులతో నవ్వించడమే కాకుండా, అదిరిపోయే డ్యాన్స్‌లు కూడా చేశానని చెప్పుకొచ్చారు. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి చిత్రాలు బాబు మోహన్ కెరీర్‌ను మలుపు తిప్పాయి. మాయలోడులో సౌందర్య తో చేసిన వాన సాంగ్ నేటికీ మారు మోగిపోతున్న విషయం తెలిసిందే.
babumohan, sv krishnareddy, soundarya
![]() |
![]() |