Home  »  News  »  'లవ్ ఓ లవ్' ట్రైలర్:  యూట్యూబ్ ఫేమ్‌ 'నాగదుర్గ' విచిత్రమైన లవ్ స్టోరీ!

Updated : Jul 6, 2026

తెలంగాణ జానపద గీతాలు, యూట్యూబ్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ మరియు లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగమ్మాయి నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. యూట్యూబ్‌లో తనదైన నటన, డ్యాన్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న ఈ తెలంగాణ బ్యూటీ, తమిళ చిత్రసీమలో హీరోయిన్‌గా అడుగుపెడుతూ చేసిన మొదటి చిత్రం 'లవ్ ఓ లవ్' (Love Oh Love). ఈ సినిమాలో హీరోగా ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణన్ నటించగా, మహేష్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం జూలై 10వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.  చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఈ రోజుల్లో ప్రేమించడం ఎంత ఈజీనో, ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి, లవర్ చేసే విలాసవంతమైన ఖర్చులను భరించడానికి ఈ తరం అబ్బాయిలు పడే కష్టాలు, మానసిక సంఘర్షణలు ఎలాంటివో ఈ 'లవ్ ఓ లవ్' ట్రైలర్‌లో చాలా రియలిస్టిక్‌గా, వినోదాత్మకంగా చూపించారు. ట్రైలర్ లోని కథాంశం ప్రకారం హీరో రఘువరన్ ఒక సాధారణ యువకుడు. తన గర్ల్‌ఫ్రెండ్ మితిమీరిన ఖర్చులు, లగ్జరీ లైఫ్ స్టైల్ వల్ల అతని జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా, చివరకు ఉద్యోగం కూడా ఊడిపోతుంది. ఈ కష్టాల వల్ల సొంత కుటుంబం కూడా అతన్ని దూరం పెడుతుంది. ఇలాంటి విచిత్రమైన, గందరగోళ పరిస్థితుల మధ్య సాగే ఒక భిన్నమైన లవ్ స్టోరీగా ఈ సినిమాను మలిచారు. ముఖ్యంగా ట్రైలర్‌లో హీరో "బ్రేకప్‌ను లీగలైజ్ చేయాలి" అంటూ కోర్టు మెట్లెక్కి చెప్పే డైలాగులు, చేసే హంగామా నేటి యువతను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. అబ్బాయిల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే, అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ, రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

ఈ చిత్రంలో నాగదుర్గ తన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి వస్తోంది. ట్రైలర్‌లో ఆమె లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. కేవలం నూతన నటీనటులే కాకుండా ఈ సినిమాలో కోలీవుడ్ దిగ్గజ దర్శకులు సెల్వరాఘవన్, కె.ఎస్.రవికుమార్‌లతో పాటు సీనియర్ నటి వనితా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఇంతమంది ప్రముఖులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జినిమా మీడియా అండ్ క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ పార్తిబన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. మరి తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన మన నాగదుర్గ, జూలై 10న థియేటర్లలోకి వస్తున్న ఈ 'లవ్ ఓ లవ్' సినిమాతో హీరోయిన్‌గా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ముఖ్యంగా నేటి ప్రేమికులు, యువత ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 

 

 

Naga Durga, Love Oh Love Trailer, Love Oh Love Telugu Movie, Pavish Narayan, Naga Durga Tamil Movie, Tollywood Latest News






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.