![]() |
![]() |

-ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారిన పవన్ తాజా న్యూస్
-నైట్ మొత్తం పాముల పక్కన పడుకున్నాడా!
-పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)కి తన చాలా సినిమాల డబ్బింగ్ ని రామానాయడు స్టూడియోస్ లో చెప్పడం అలవాటు. ఈ మేరకు నైట్ మొత్తం రామానాయుడు స్టూడియోస్ లోనే పడుకొని తెల్లవారు జామున నాలుగు గంటలకి డబ్బింగ్ చేపి వెళ్తుంటాడు.
తన దర్శకత్వంలో వచ్చిన 'జానీ'(JOhnny)మూవీకి కూడా అలవాటు ప్రకారమే రాత్రంతా రామానాయుడు స్టూడియోస్ లోనే ఒక సోఫాలో పడుకొని నాలుగు గంటలకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాడు. పవన్ వెళ్ళగానే సోఫాలో నుంచి ఒక పాము బయటకి వచ్చింది. ఈ విషయాన్నీ డబ్బింగ్ ఇన్ ఛార్జ్ గమనించాడు. దాంతో సోఫా మొత్తాన్ని చెక్ చేయగా ఇంకో మూడు పాము పిల్లలు కూడా సోఫాలో ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు.
'జానీ' టైంలో జరిగిన ఈ సంఘటన రీసెంట్ గా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. చాలా సంవత్సరాల క్రితం రామానాయుడు స్టూడియో చుట్టూ కొండలు చాలా ఎక్కువగా ఉండేవి. స్వచ్ఛమైన గాలి కోసం స్టూడియోస్ లోని ఫ్లోర్ ల తలుపులని నైట్ పూట తెరిచి ఉంచడంతో వాటిల్లో ఉన్న పాములతో పాటు పలురకాల కీటకాలు నైట్ అయితే స్టూడియోస్ లో కి వచ్చేవి. ఇప్పుడు ఈ సంఘటన ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారడంతో రాత్రంతా పవన్ కళ్యాణ్ పాములు పైన పడుకొని ఉన్నాడా! అని నోరెళ్లబెడుతున్నారు. ఇక ఇప్పుడైతే రామానాయుడు స్టూడియోస్ పక్కల నూతనంగా సుందరీకరించబడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంది.

![]() |
![]() |