![]() |
![]() |

సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మధ్య కోలీవుడ్‌లో తీవ్ర వివాదం నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ప్రచారాలు, అభిమానుల మధ్య జరుగుతున్న వార్లపై ప్రముఖ యువ నటుడు విష్ణు విశాల్ తీవ్రంగా స్పందించారు. తన తాజా చిత్రం 'గట్టా కుస్తీ 2' (Gatta Kusthi 2) ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు విశాల్, ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్స్, సెలబ్రిటీల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.
సదరు ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ మాట్లాడుతూ, ఒక అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకుని, ఎన్నో శిఖరాలను అధిరోహించిన రజనీకాంత్ వంటి ఒక మహోన్నత వ్యక్తి, మైక్ ముందుకు వచ్చి "నాకు సీఎం విజయ్ అంటే ఎలాంటి అసూయ లేదు" అని స్వయంగా బహిరంగంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. కేవలం సోషల్ మీడియాలో వచ్చే కొన్ని పుకార్లు, నెగెటివ్ వార్తల వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. రజనీకాంత్ వంటి గ్లోబల్ స్టార్ కేవలం 4 రోజులు మౌనంగా ఉన్నందుకే, ఆయనను తప్పుబడుతూ ఆన్‌లైన్ తుఫాన్ సృష్టించారు. దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏలిన తలైవా, యువ హీరోపై ఎందుకు అసూయపడతారని ఆయన ప్రశ్నించారు.
ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైందంటే, తమిళనాడు శాసనసభ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ భారీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రజనీకాంత్ స్పందించలేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ట్రోల్ చేశారు. రజనీకాంత్ కేవలం అధికార డీఎంకే (DMK) పార్టీకే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై రజనీకాంత్ ఇటీవల చెన్నైలోని తన నివాసంలో విలేకరుల సమావేశం పెట్టి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అందులో ఆయన నవ్వుతూ, "నాకు విజయ్‌పై ఎందుకు అసూయ ఉంటుంది? ఒకవేళ నా సమకాలీనుడైన కమల్ హాసన్ సీఎం అయితే నేను కొంత అసూయపడతానేమో! విజయ్‌కి నాకు మధ్య 25 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అలాంటిది మేమిద్దరం పోటీ పడటం ఏంటి?" అని సరదాగా వ్యాఖ్యానించారు.
Also read: Jaya Krishna: శ్రీనివాస మంగాపురం ఆ థియేటర్ లో ఎన్ని రోజులు ఆడబోతుంది..ఘట్టమనేని పేరు నిలబెడతాడా!
అయినప్పటికీ, జూన్ 22న సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ ఎటువంటి శుభాకాంక్షలు తెలపకపోవడంతో మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. దీనిపై తన రాబోయే చిత్రం ' ధర్మాన్' టైటిల్ లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ స్పందిస్తూ, "ఈ రోజుల్లో ఎవరైనా నన్ను మాట్లాడటానికి పిలిస్తేనే భయమేస్తోంది. నేను ఏం మాట్లాడినా అది వివాదంగా మారుతోంది. పోనీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. నోట్లో కొడుకట్టై (ఒక రకమైన తీపి వంటకం) పెట్టుకున్నాడా అంటూ ఎగతాళి చేస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |